జాతీయ వార్తలు

వికీపీడియాలో ‘నన్ను చంపేశారు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆమె అధికార పక్ష పార్లమెంటు సభ్యురాలు... ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలకూ హాజరవుతున్నారు... బుధవారం కూడా ఆమె సభలో ఉన్నారు. అయినా ఏం ప్రయోజనం! వికీపీడియా వెబ్‌సైట్ సాక్షిగా ఆమె మార్చి 3వ తేదీనే మరణించారు. చట్టసభల సాక్షిగా కళ్ళముందు కనిపిస్తున్న ఆమె పేరు అంజు బాల. ఈ చేదు నిజాన్ని బుధవారం పార్లమెంటులో స్వయంగా ప్రకటించడంతో కలకలం చెలరేగింది. లోక్‌సభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తిన అంజుబాల, వారం క్రితం జరిగిన ఓ మహిళా సదస్సులో పాల్గొన్న అనంతరం ముంబయి నుంచి ఓ వ్యక్తి నా కార్యదర్శికి ఫోన్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ఇలాగే మరికొంతమంది నుంచి ఫోన్లు వచ్చాయని వెల్లడించారు. నా వ్యక్తిత్వాన్ని, పరపతిని దెబ్బతీసేలా వ్యవహరించిన వికీపీడియాపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి కేసు నమోదు చేయాలని అంజుబాల డిమాండ్ చేశారు. వికీపీడియా వ్యవహార శైలిపై సభలో విమర్శలు వెల్లువెత్తడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ జోక్యం చేసుకుని, ఈ అంశం నిన్ననే నా దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ విషయమై న్యాయశాఖ మంత్రి సదానందగౌడ మాట్లాడుతూ, ఇది చాలా తీవ్రమైన అంశమని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని సభకు హామీ ఇచ్చారు.