తెలంగాణ

ఎఇఇ పోస్టుల ఫలితాల వెల్లడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నిర్వహించిన తొలి రిక్రూట్‌మెంట్ ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ మంగళవారం నాడు విడుదల చేసింది. 931 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (సివిల్) పోస్టులకు గత ఏడాది సెప్టెంబర్ 20వ తేదీన పరీక్ష నిర్వహించింది. లిఖిత పరీక్షలో అర్హులకు గత ఫిబ్రవరి 8 నుండి 26 వరకూ ఇంటర్వ్యూలను నిర్వహించి 904 మంది అభ్యర్ధులను ఎంపిక చేశారు. ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా ఆబ్జెక్టివ్ టైప్‌లో నిర్వహించారు. 30వేల మంది హాజరయ్యారు. అభ్యర్ధుల మూర్తిమత్వం అంచనా వేసేందుకు మూర్తిమత్వ నిపుణుడిని కూడా ఇంటర్వ్యూ బోర్డులో ఉంచామని తద్వారా అభ్యర్ధుల అవగాహనను అంచనా వేశామని కమిషన్ పేర్కొంది.

పుర’ ఫలితాలు నేడే

ఉత్కంఠ కలిగిస్తున్న ఖమ్మం

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 8: ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, అచ్చంపేట నగర పంచాయితీ ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం జరగనుంది. మధ్యాహ్నానికి ఫలితాలు వెలువడుతాయి. ఖమ్మంలో మున్సిపల్ కార్పొరేషన్‌లో 50 వార్డులు, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 58 వార్డులు ఉన్నాయి. దేశంలో తొలిసారిగా మున్సిపల్ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లోనే ఇవిఎంలకు ప్రింటర్‌ను జతచేశారు. ఓటరు తాను ఏ పార్టీకి ఓటు వేసింది రసీదులో చూసుకోవచ్చు. వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో బహుముఖ పోటీ జరిగింది. అచ్చంపేటలో టిఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్, టిడిపి, బిజెపి అన్ని పార్టీలు కలిపి ఐక్య కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. వరంగల్‌లో టిఆర్‌ఎస్ భారీ మెజారిటీపై ఆశలు పెట్టుకుంది. ఖమ్మంలో పోటీ చేయడం తొలిసారి కావడం వల్ల ఆసక్తికరంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తరువాత ఖమ్మంలో టిఆర్‌ఎస్ అనూహ్యంగా పుంజుకుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత చాలామంది స్థానిక నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో ఖమ్మంలో విజయం మాదే అని టిఆర్‌ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఖమ్మంలో టిఆర్‌ఎస్, వామపక్షాలు, టిడిపి, కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య బహుముఖ పోటీ జరిగింది. కొన్ని వార్డుల్లో వామపక్షాలు, టిడిపి, కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు లోపాయకారిగా ఒప్పందాలు కుదుర్చుకుని పరస్పరం మద్దతు ప్రకటించుకున్నాయి.