జాతీయ వార్తలు

‘సవాళ్ల’ను అధిగమించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి: ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పు, ఇంధన సంక్షోభం, భయంకరమైన వ్యాధులను సవాళ్లుగా స్వీకరించి పరిష్కార మార్గాలు కనుక్కోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. ‘కట్-పేస్ట్’ పద్ధతిలో కాకుండా సృజనాత్మక పరిశోధనల ద్వారా ఈ సమస్యలకు పరిష్కారాలను కనుక్కోవాలని ఆయన సూచించారు. సోమవారం ఇక్కడ ఆయన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బిహెచ్‌యు) స్నాతకోత్సవంలో మాట్లాడుతూ విద్యాభ్యాసం ముగిసిన తరువాత కూడా ఎప్పటికప్పుడు తాజా విజ్ఞానాన్ని సముపార్జించడానికి కొత్త కొత్త అంశాలపై మనసు లగ్నం చేయాలని విద్యార్థులకు సూచించారు. ‘ఈ దేశ యువతీ యువకులకు నేను ఈ సవాలు విసురుతున్నాను. భూతాపాన్ని కాస్తయినా తగ్గించడంలో ప్రపంచానికి తోడ్పడటానికి, ప్రత్యామ్నాయ ఇంధన వనరులను కనుక్కోకపోతే తలెత్తే ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో సహాయపడటానికి నూతన ఆవిష్కరణలతో ముందుకురండి’ అని మోదీ బిహెచ్‌యు స్నాతకోత్సవానికి తరలివచ్చిన పరిశోధకులు, విద్యావేత్తలను ఉద్దేశించి అన్నారు. విద్యార్థులు మన దేశం, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను కనుగొనాలనే కలలను కనాలని ఆయన సూచించారు. ‘మనకు సృజనాత్మక ఆవిష్కరణలు ఎంతో ముఖ్యం.. కొత్త పరిశోధనలు కట్-పేస్ట్ పద్ధతిద్వారా కేవలం పిహెచ్‌డిలు పొందేవిగా ఉండకూడదు’ అని ఆయన అన్నారు. ప్రధాని వ్యాఖ్యలకు స్నాతకోత్సవంలో నవ్వులు విరిశాయి. బిహెచ్‌యులో కట్-పేస్ట్ పద్ధతి తెలిసి ఉండదని తాను భావిస్తున్నానని, ఒకవేళ తెలిసినా ఆ పద్ధతిని అనుసరించకూడదని ప్రధాని హితవు పలికారు. గిరిజన కుటుంబాలలో క్యాన్సర్ కన్నా భయంకరమైన ‘సికిల్-సెల్’ వ్యాధి ఉండటంపై తాను గతంలో ఒక నోబెల్ బహుమతి గ్రహీతను సంప్రదించానని ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు. అయితే ఈ వ్యాధికి మన పరిశోధకులే మెరుగయిన పరిష్కారాన్ని కనుగొంటారనే తాను భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. భూతాపం గురించి ఆయన మాట్లాడుతూ ప్రపంచం మొత్తం ఈ సమస్యతో బాధపడుతోందని చెప్పారు. అయితే భారతీయులు ప్రకృతిని దోచుకోవడాన్ని నేరంగా పరిగణిస్తారని, మొక్కల్లో దేవుడిని, నదిలో తల్లిని చూస్తారని ఆయన అన్నారు. ‘ఇలాంటి దేశం భూతాపానికి పటిష్ఠమైన పరిష్కారాన్ని కనుగొనలేదా?’ అని ఆయన ప్రశ్నించారు. ప్రపంచం ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎథనాల్‌ను చెరకు రైతులకు ఉపయోగించడంతోపాటు సమర్థవంతమైన ఇంధనంగా ఎలా ఉపయోగించుకోగలం అనే పరిశోధనల ద్వారా పరిష్కారం దొరుకుతుందని మోదీ అన్నారు.

బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బిహెచ్‌యు) స్నాతకోత్సవంలో ఒక విద్యార్థికి పట్టాను ప్రదానం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. చిత్రంలో కాంగ్రెస్ నేత కరణ్ సింగ్