జాతీయ వార్తలు

ఢిల్లీలో కదం తొక్కిన పాత్రికేయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పటియాలా హౌస్ కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో విలేఖర్లపై జరిగిన దాడిని నిరసిస్తూ మంగళవారం న్యూఢిల్లీలో వందలాది మంది పాత్రికేయులు, జాతీయ ప్రచార మాధ్యమాలకు చెందిన పలువురు సంపాదకులు కదం తొక్కారు. దేశద్రోహ అభియోగాలతో అరెస్టయిన జెఎన్‌యు విద్యార్థి సంఘ అధ్యక్షుడి కేసు విచారణ వార్తలను సేకరించేందుకు వెళ్లిన విలేఖర్లతోపాటు జెఎన్‌యు విద్యార్థులు, అధ్యాపకులపై సోమవారం పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అనేకమంది పాత్రికేయులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి, ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా నుంచి సుప్రీం కోర్టు వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. విలేఖర్లపై దాడికి తెగబడిన న్యాయవాదుల లైసెన్సులను రద్దుచేసి, ఢిల్లీ పోలీసు కమిషనర్ పదవి నుంచి బిఎస్.బస్సీని తొలగించాలని, అలాగే ఈ వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని పౌరుల భావప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించాలని కోరుతూ వారు సుప్రీం కోర్టు రిజిస్ట్రార్‌కు వినతి పత్రం సమర్పించారు. ‘పటియాలా హౌస్ కోర్టు కాంప్లెక్స్‌లో విలేఖర్లపై దాడి జరిగి 24 గంటలు గడచినప్పటికీ ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు జోక్యం విలేఖర్లపై దాడికి పాల్పడిన న్యాయవాదులపై తగిన చర్యలు చేపట్టాలని, అలాగే వారి లైసెన్సులను రద్దు చేయాల్సిందిగా బార్ కౌన్సిల్‌ను ఆదేశించాలని మేము కోరుతున్నాం’ అని వారు ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. అనంతరం పలువురు పాత్రికేయులతో కూడిన మరో ప్రతినిధి బృందం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కూడా వినతి పత్రం సమర్పించింది. పటియాలో హౌస్ కోర్టు కాంప్లెక్స్‌లో విలేఖర్లు, జెఎన్‌యు విద్యార్థులు, అధ్యాపకులపై జరిగిన దాడిని వౌనంగా చూస్తుండిపోయిన ఢిల్లీ పోలీసులను ఈ ఘటనకు బాధ్యులను చేయాలని వారు ఆ వినతి పత్రంలో రాజ్‌నాథ్‌కు విజ్ఞప్తి చేశారు.
విచారణకు ‘సుప్రీం’ అంగీకారం
పటియాలా హౌస్ కోర్టు కాంప్లెక్స్‌లో సోమవారం జరిగిన ఘర్షణపై తక్షణమే విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు మంగళవారం అంగీకరించింది. ఈ దాడికి పాల్పడిన నిందితులతో పాటు, దాడి జరుగుతున్నప్పుడు అక్కడ వౌనంగా నిల్చుండిపోయిన ఢిల్లీ పోలీసులపై తగిన చర్యలు చేపట్టాలని కోరుతూ దాడిలో గాయపడిన జెఎన్‌యు అధ్యాపకుడు ఎన్‌డి.జైప్రకాష్ ప్రధాన న్యాయమూర్తి టిఎస్.్థకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట పిటిషన్ దాఖలు చేయడంతో ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది.

చిత్రం... పటియాలా కోర్టు ప్రాంగణంలో సోమవారం జర్నలిస్టుపై జరిగిన దాడిని నిరసిస్తూ మంగళవారం ప్రెస్‌క్లబ్ నుంచి సుప్రీం కోర్టుకు చేపట్టిన మార్చ్ ఆందోళనను అడ్డుకుంటున్న పోలీసులు