జాతీయ వార్తలు

ఉగ్రవాదం కీలకాంశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలాలంపూర్, నవంబర్ 20: భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నుంచి మూడు రోజుల పాటు చేసే మలేసియా పర్యటనలో ఉగ్రవాదం, మనుషుల అక్రమ రవాణా, తీరప్రాంత రక్షణ, దక్షిణ చైనా సముద్ర వివాదం, వాణిజ్యం అంశాలపై కేంద్రీకరించనున్నారు. ఆసియాన్-ఇండియా, తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులలో మోదీ ప్రసంగించనున్నారు. మలేసియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ సహా ఆ దేశ ఉన్నత స్థాయి నాయకత్వంతో మోదీ చర్చలు జరుపుతారు. రక్షణ, భద్రత వంటి రంగాలలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంపొందించుకునే మార్గాలపై ఆయన మలేసియా నాయకత్వంతో చర్చలు జరుపుతారు. మోదీ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. మోదీ ఆదివారం తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో ప్రసంగిస్తారు. పదేళ్ల క్రితం ఇక్కడ ప్రారంభమైన ఈ గ్రూపులో భారత్ వ్యవస్థాపక సభ్యదేశం. తమ ప్రభుత్వ ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’లో మలేసియా కీలకంగా ఉంటుందని మోదీ చెప్పారు. భారత్‌కు మలేసియాతో 2010 నుంచి వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది.
ఇండియా-ఆసియాన్ చర్చలలో అనుసంధానం (కనెక్టివిటీ) అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. భారత్- మైన్మార్ - థాయిలాండ్ దేశాలతో సంబంధం ఉన్న మోటార్ వెహికల్ ఒప్పందం ఖరారు అయింది. ఆసియాన్-్భరత్ సముద్ర రవాణా ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయి. రాజకీయ-్భద్రత, ఆర్థిక, సామాజిక-సాంస్కృతిక అంశాలలో ఆసియాన్-్భరత్ మధ్య సహకారాన్ని మరింత పెంపొందించే కొత్త కార్యాచరణ ప్రణాళిక (2016-20)పై కూడా నేతలు చర్చించనున్నారు. ఇటీవల పారిస్ నగరంపై ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు విరుచుకుపడి 129 మందిని ఊచకోత కోసిన పరిణామాలతో వివిధ దేశాలు దిగ్భ్రాంతికి లోనయిన నేపథ్యంలో ఉగ్రవాదంపై యుద్ధం అంశం కూడా పదో తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో కీలకంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఉగ్రవాద జాడ్యాన్ని నిర్మూలించటానికి తీసుకుంటున్న చర్యలను తీవ్రతరం చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. అక్రమ వలసలు, దక్షిణ చైనా సముద్ర వివాదం, కొరియన్ ద్వీపకల్పం, మధ్యప్రాచ్యంలో పరిస్థితిపై కూడా తూర్పు ఆసియా శిఖరాగ్ర దేశాల నాయకులు చర్చించే అవకాశం ఉంది. తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో సుమారు ఏడు స్టేట్‌మెంట్లు, డిక్లరేషన్లను ఆమోదించాల్సి ఉంది.

జాతీయ స్థాయిలో ‘మహా’ కూటమి?

న్యూఢిల్లీ, నవంబర్ 20: అయిదో సారి బిహార్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నితీశ్‌కుమార్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఎన్డీఏ ప్రత్యామ్నాయ కూటమికి పునాదులు పడ్డాయి. పాట్నాలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన నితీశ్ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, తృణమూల్ కాంగ్రెస్. నేషనల్ కాన్ఫరెన్స్, జెడి(ఎస్), ఆర్‌ఎల్‌డి, ఐఎన్‌ఎల్‌డి, డిఎంకె, అస్సాం గణ పరిషత్, ఎన్‌సిపి తదితర పార్టీల నాయకులు హాజరయ్యారు. కాంగ్రెసేతర పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రివాల్, మాజీ ప్రధాని దేవెగౌడ, జమ్మూ, కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాలాంటి హేమాహేమీలు హాజరు కావటం ద్వారా ఎన్డీఏ ప్రత్యామ్నాయ శక్తుల బల ప్రదర్శన జరిగింది. నరేంద్ర మోదీ ప్రధాని పదవి చేపట్టిన తరువాత నాన్ బిజెపి శక్తులు ఇంత పెద్దస్థాయిలో బలప్రదర్శన చేయటం ఇదే మొదటిసారి. జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటు ప్రయత్నాల్లో లాలూ ప్రసాద్ కీలక పాత్ర నిర్వహిస్తున్నారు. ప్రధాని తరఫున కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైనా ఆయనను పట్టించుకున్న నాథుడు కనిపించలేదు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ప్రతిపక్ష నాయకుల దృష్టి అంతా ఢిల్లీలో ఎన్డీఏకు ప్రత్యామ్నాయం ఏర్పాటుపై కేంద్రీకృతమైందని చెబుతున్నారు. శనివారం సమాజ్‌వాదీ పార్టీ అధినాయకుడు ములాయం సింగ్ యాదవ్ 76వ జన్మ దినోత్సవ కార్యక్రమానికి నితీష్‌కుమార్‌తోపాటు ఆర్‌జెడి అధినాయకుడు లాలూ ప్రసాద్ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయటంపై దృష్టి సారించనున్నారు.