తెలంగాణ

నేడు ఢిల్లీకి హరీశ్ బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5:కృష్ణా బోర్డు వివాదాన్ని తెలంగాణ ప్రభుత్వం సోమవారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి దృష్టికి తీసుకు వెళ్లనుంది. నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కె జోషి, టిఆర్‌ఎస్ పార్లమెంటు సభ్యుల బృందం సోమవారం సాయంత్రం నాలుగున్నరకు ఢిల్లీలో కేంద్ర మంత్రి ఉమాభారతితో సమావేశం అవుతుంది. కృష్ణా బోర్డు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణకు అన్యాయం చేస్తోందని వారు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువస్తారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారమే నీటివాటా పంపిణీ జరుగుతుందని, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రాజెక్టులవారీగా తెలంగాణ వాటా తేల్చాల్సి ఉందని తెలంగాణ వాదిస్తోంది. ప్రధానమంత్రిని కూడా కలిసి ఈ వివరాలన్నీ చెప్పాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.
బోర్డు పరిధి దాటుతోంది: తుమ్మల
కృష్ణా బోర్డు తన అధికార పరిధిని దాటి వ్యవహరిస్తోందని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. తెలంగాణ భవన్‌లో అధివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమశిల ప్రాజెక్టును కృష్ణాబోర్డు పరిధిలోకి తీసుకు రావాలన్న కృష్ణా బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తామని చెప్పారు. కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాల మధ్య వాటర్ మేనేజ్‌మెంట్ కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక నియామకం మాత్రమేనని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రెండు రాష్ట్రాల్లో పంటలు ఎండిపోకుండా చూడాల్సిన బాధ్యత మాత్రమే బోర్డుకు ఉందని అన్నారు.