జాతీయ వార్తలు

ఇక దేశమంతా చెల్లుతాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: రాష్ట్ర అధికారులు జారీచేసే వికలాంగుల సర్ట్ఫికెట్లు త్వరలోనే దేశమంతటా చెల్లుబాటవుతాయి. వికలాంగుల హక్కు బిల్లు-2014 ముసాయిదాలో ఈ మేరకు ఒక నిబంధనను చేర్చారు. సంప్రదింపులకోసం ఈ బిల్లును ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపించారు. ‘కొత్త బిల్లులో ప్రభుత్వం ఒక నిబంధనను చేర్చింది. దాని ప్రకారం ఒకసారి జారీ అయిన వికలాంగుల సర్ట్ఫికెట్ దేశమంతటా లేదా ఏ కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలోనైనా చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడున్న చట్టంలో అలాంటి వెసులుబాటు లేదు. అందువల్ల ఏం జరుగుతోందంటే ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జారీచేసే వికలాంగుల సర్ట్ఫికెట్ ఢిల్లీలో కానీ, లేదా ఇతర రాష్ట్రంలో కానీ చెల్లుబాటు కాదు. అందువల్ల వికలాంగుడు తాను ఉన్నచోటు మారినా లేదా పెళ్లి చేసుకుని వేరే రాష్ట్రానికి మారినా ఇబ్బంది ఎదుర్కొంటాడు’ అని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారికత మంత్రి తావా చంద్ గెహ్లాట్ మంగళవారం ఇక్కడ వికలాంగులకు సంబంధించిన రాష్ట్రాల కమిషనర్ల 14వ జాతీయ సమావేశాన్ని ప్రారంభిస్తూ చెప్పారు. ముసాయిదా బిల్లులో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు లభించే వికలాంగుల కేటగిరీలను ఇప్పుడున్న 7నుంచి 19కి పెంచినట్లు మంత్రి చెప్పారు. 1995నాటి వికలాంగుల చట్టం స్థానంలో ఈ కొత్త బిల్లును తీసుకు వస్తున్నారు.
రాబోయే రెండు నెలల్లో ప్రభుత్వం వెబ్ ఆధారిత యూనిక్ డిజెబిలిటీ ఐడెంటిఫికేషన్ (యుడిఐడి) కార్డును ప్రవేశపెట్టబోతోందని, మధ్యప్రదేశ్‌లోని రట్లాం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని తొలుత ప్రారంభిస్తామని గెహ్లాట్ చెప్పారు. దీనివల్ల వికలాంగుల సర్ట్ఫికెట్లకు దేశవ్యాప్తంగా చెల్లుబాటు లభించడమే కాకుండా వివిధ అవసరాలకోసం అన్ని రకాల సర్ట్ఫికెట్లను మోసుకుపోవలసిన ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఈ కార్డులో అంగవైకల్యంతోసహా అనేక రకాల వివరాలుంటాయి. ఈ కార్డులో గుర్తింపునకు సంబంధించి వ్యక్తి పేరు, చిరునామా, పుట్టిన తేదీ, తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పేర్లు, మొబైల్ నంబరు, ఆదాయం వివరాలు, ఏ రకం అంగవైకల్యం, బ్యాంక్ వివరాలు, బిపిఎల్ వివరాలు, ఓటరు ఐడి వివరాలులాంటివన్నీ కూడా ఇంగ్లీషులో, స్థానిక భాషలోను ఉంటాయి.
మంగళవారం సమావేశంలో వికలాంగులకు విద్య, ఉపాధి లేదా స్వయం ఉపాధి అవకాశాలు, సామాజిక భద్రతలాంటి వాటిపై ప్రత్యేక దృష్టితో ఇప్పుడున్న చట్టంలోని వివిధ నిబంధనల అమలు ఏ స్థితిలో ఉన్నాయో చర్చించడంతోపాటు చట్టాన్ని మరింత పటిష్ఠంగా అమలు చేయడానికి వ్యూహాన్ని రూపొందిస్తారు.