జాతీయ వార్తలు

ఢిల్లీ సర్కారు ఉద్యోగం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: పరిహార కారణాలతో తాము ఇవ్వజూపిన ఉద్యోగాన్ని స్వీకరించేందుకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సియు)లో ఆత్మహత్య చేసుకున్న పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల సోదరుడు ఆసక్తితో లేడని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. చీఫ్ జస్టిస్ జి.రోహిణి, జస్టిస్ జయంత్ నాథ్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనానికి ఢిల్లీ ప్రభుత్వం ఈ విషయాన్ని వివరించింది. అంతేకాకుండా రోహిత్ వేముల సోదరుడికి ఉద్యోగం ఇవ్వాలన్న తమ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని డిస్మిస్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం కోరింది. ‘పరిహార కారణాలతో మేము ఇవ్వజూపిన ఉద్యోగాన్ని స్వీకరించేందుకు ఆసక్తితో లేనని రోహిత్ వేముల సోదరుడు మాకు లేఖ రాశాడు. దీంతో ఈ అంశంపై దాఖలైన రిట్ పిటిషన్‌ను డిస్మిస్ చేయాల్సిందిగా కోరుతున్నాం’ అని ఢిల్లీ ప్రభుత్వం తరఫున న్యాయవాది గౌతమ్ నారాయణ్ విన్నవించారు.

అయితే దీనిపై ఢిల్లీ ప్రభుత్వం ప్రమాణ పత్రాన్ని (అఫిడవిట్‌ను) దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.