జాతీయ వార్తలు

న్యాయం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్యేక ప్యాకేజీ అనేదేదీ అడగ లేదు. రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరాను.. ఇది వారి బాధ్యత. విభజన సమయంలో సమ న్యాయం చేసి ఉంటే తాను ప్రతిసారి ఢిల్లీకి వచ్చి ఇలా అడుక్కోవలసిన అవసరం ఉండేది కాదు.

న్యూఢిల్లీ,మే 17: విభజన మూలంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో విడివిడిగా ముఖాముఖి చర్చలు జరిపిన అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలతో పాటు ఇతర హామీలను పూర్తి చేయాలని, ఇతర సమస్యలనూ పరిష్కరించాలంటూ తాను లేఖ ఇచ్చానన్నారు. వీలున్నంత త్వరగా రాష్ట్ర సమస్యలకు ఒక పరిష్కారం చూపిస్తామని మోదీ తెలిపారన్నారు. దేశంలో నెలకొన్న కరవు గురించి చర్చించి భవిష్యత్తులో కరవురహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు అనుసరించవలసిన వ్యూహంపై చర్చించేందుకు పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. అనంతరం నరేంద్ర మోదీతో విడిగా సమావేశమైన చంద్రబాబు విభజన చట్టం హామీలు, ఆంధ్ర ఎదుర్కొంటున్న ఇతర సమస్యల గురించి చంద్రబాబు చర్చించారు. ప్రత్యేక హోదా, పోలవరం, ప్రత్యేక రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం నిర్మాణం తదితర అనేక అంశాలను ఈ సందర్భంగా చంద్రబాబు ప్రధానంగా ప్రస్తావించారు.
ఆ రాష్ట్రాలు ఏమి సాధించాయి?
నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర తదితర ఈశాన్య రాష్ట్రాలకు పది సంవత్సరాల క్రితమే ప్రత్యేక హోదా ఇచ్చినా అవేవీ అభివృద్ధి చెందలేదని ఏపీకి ప్రత్యేక హోదా గురించి విలేఖరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదు కాబట్టి ఏపీకి ప్రత్యేక హోదా వద్దంటారా అన్న మరో ప్రశ్నకు ‘ప్రత్యేక హోదా ఇచ్చి నిధులు ఇవ్వకపోతే ఏం లాభం..’ అంటూ ఎదురు ప్రశ్నవేశారు. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారా అన్న ఇంకో ప్రశ్నకు ‘ప్రత్యేక ప్యాకేజీ అనేదేదీ అడగ లేదు. రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరాను.. ఇది వారి బాధ్యత’ అని చంద్రబాబు తెలిపారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన కాంగ్రెస్‌కు ప్రజలు శిక్ష విధించారని బాబు అన్నారు. అంటే సహాయం చేయకపోతే కాంగ్రెస్‌కు పట్టిన గతే బిజెపికి కూడా పడుతుందని హెచ్చరిస్తున్నారా? అని ఒక విలేకరి అడిగినప్పుడు ‘విభజన సమయంలో కాంగ్రెస్ సారథ్యంలోని అప్పటి యుపిఏ ప్రభుత్వం సమన్యాయం చేయకుండా ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేసింది. అవమానాలకు గురి చేసింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపితోపాటు అన్ని పార్టీలకూ ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉందని ఆవేశంగా చెప్పారు. విభజన సమయంలో సమ న్యాయం చేసి ఉంటే తాను ప్రతిసారి ఢిల్లీకి వచ్చి ఇలా అడుక్కోవలసిన అవసరం ఉండేది కాదన్నారు. సొంత రాజధాని కూడా లేని ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయవలసిన బాధ్యత తన భుజస్కంధాలపై ఉందన్నారు. అందుకే తాను మాటిమాటికీ ఢిల్లీకి వచ్చి సహాయం అడుగుతున్నానని చెప్పా రు. హోదా ఇవ్వటం జరగదంటూ కేంద్ర మంత్రులు, బిజెపి నాయకులు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసినప్పుడు ‘వారు ఏం చెబుతున్నారన్నది ముఖ్యం కాదు. మనం ఏ మేరకు సాధించుకున్నామనేది ముఖ్యం’ అని బదులిచ్చారు.

కేంద్రప్రభుత్వం
కొంత చేసింది

కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభు త్వం ఆంధ్రప్రదేశ్‌కు సహాయ పడుతున్నా ఇంకా చేయాల్సిం ది ఎంతో ఉందని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా ఎదుర్కొంటున్న సమ స్య బడ్జెట్ లోటును భర్తీ చేయవలసిన బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. అలాగే రాజధాని నిర్మాణానికి కేంద్రం పెద్ద ఎత్తున సహాయం చేయాలన్నారు. సొంత రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేననేది ప్రధాన మంత్రికి వివరించానని చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి కావాలంటే ప్రతి ఏటా నాలుగైదు వేల కోట్ల రూపాయలు కేటాయించాలన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం మరింత ముదరకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండా పలు ప్రాజెక్టులు చేపట్టిన విషయాన్ని ప్రధాని దృష్టికి తెచ్చినట్లు ఆయన వెల్లడించారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు.

చిత్రం... మంగళవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు