జాతీయ వార్తలు

శ్రీనగర్‌లో తెలుగు విద్యార్థుల వెతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి చేయడమే కాకుండా ఇప్పటికీ వెంటాడి వేధిస్తున్నారని శ్రీనగర్ ఎన్‌ఐటిలో చదువుతున్న తెలుగు విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ పోటీ సందర్భంగా నిట్ విద్యార్థులపై స్థానికులు దాడి చేశారు. ఈ సందర్భంగా పోలీసులు నిట్‌లోకి ప్రవేశించి విద్యార్థులపై లాఠీ చార్జి చేశారు. ఇక్కడ తెలంగాణ, ఎపికి చెందిన విద్యార్థులు 120 మంది ఉండగా, లాఠీచార్జిలో సుమారు 50 మంది గాయపడ్డారు. అయిదుగురు ఆస్పత్రి పాలయ్యారు. లాఠీచార్జి విషయమై విద్యార్థులు జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు హాస్టళ్లలోకి వచ్చి తమను బెదిరిస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. తమను బయటకు వెళ్లనీయడం లేదని, మీడియాతో పాటు ఎవరినీ లోనికి అనుమతించడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. వికలాంగులు, యువతులు అని చూడకుండా విద్యార్థులందరిపై పోలీసులు దాడులు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు తెలిపారు.