జాతీయ వార్తలు

ఆశించిన స్థాయిలోనే వృద్ధిరేటు:నిర్మలా సీతారామన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: 2019-20 తొలి త్రైమాసికంలో ఆశించిన స్థాయిలో వృద్ధిరేటు ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆమె ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడారు. ద్రవ్యోల్బణ అదుపులోనే ఉందని, కేవలం 4శాతానికి మించలేదని అన్నారు. ఎగుమతిదారులకు పలు ప్రోత్సాహాకాలను ప్రకటించారు. ఇందుకోసం ఎంఈఐఎస్ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఈ పథకం వల్ల టెక్స్‌టైల్ తదితర రంగాలకు ఊతమిస్తుందని తెలిపారు. ఈ పథకం అమలు జరిగితే రూ. 50 వేల కోట్ల ఎగుమతులు పెరుగుతాయని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో భారతదేశం స్థానం మెరుగైందని, ఇంకా మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2014 నుంచి పెరుగుతున్నాయని, ఇవి భవిష్యత్తులో మరింత పెరుగుతాయని చెప్పారు. చిన్న మొత్తాల్లో పన్ను చెల్లింపుదారులకు కఠిన నిబంధనలు ఉండవని చెప్పారు. బ్యాంకుల్లో సైతం రుణ వితరణ మెరుగైందని చెప్పారు. ద్రవ్యోల్బణం నాలుగు శాతం ఉందని తెలిపారు.