జాతీయ వార్తలు

నిర్భయ దోషుల క్యూరేటివ్ పిటిషన్లు కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మరణశిక్షను సవాల్ చేస్తూ నిర్భయ దోషులు వేసిన క్యూరేటివ్ పిటిషన్లు సుప్రీం కోర్టు కొట్టివేసింది. జస్టిస్ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు ఈ పిటిషన్లను కొట్టివేస్తూ ఏకగ్రీవంగాతీర్పు ఇచ్చింది. పిటిషన్ల వాదనకు ఎలాంటి అర్హత లేదని , ఈనెల 22న వారికి ఉరిశిక్ష అమలుచేయాల్సిందిగా ఆదేశించింది. కాగా నిర్భయ దోషులకు ఉన్న న్యాయపరమైన చిట్టచివరి అవకాశం లేకుండా పోయింది. ఇక అన్ని దారులు మూసుకుపోయినట్లే. సుప్రీం కోర్టు తీర్పుపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందిస్తూ ఏడేళ్ల తన పోరాటం ఫలించిందని, కాని దోషులను ఉరి తీసిన రోజే తనకు అత్యంత సంతోషకరమైనదని అన్నారు. ఇదిలావుండగా ఏడేళ్ల క్రితం ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆమెపై అతి క్రూరంగా వ్యవహరించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించింది. ఈ ఘటనలో దోషులైన నలుగురు ముఖేశ్ సింగ్, అక్షయ్‌కుమార్ సింగ్, వినయ్‌శర్మ, పవన్ గుప్తాలను ఈ నెల 22న ఉరి తీయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈలోగా న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవాలని సూచించింది. ఇందులో భాగంగా దోషులైన వినయ్ శర్మ, ముఖేష్ సింగ్ సుప్రీం కోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశారు.