జాతీయ వార్తలు

నిర్భయ దోషి పిటిషన్ కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నిర్భయ దోషులలో ఒకరైన ముకేశ్‌సింగ్ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ధర్మాసనం ఇది విచారణకు స్వీకరించతగినది కాదని పేర్కొంది. ముకేశ్‌సింగ్ తన పిటిషన్‌లో క్యూరేటివ్, మెర్సీ పిటిషన్లను స్వీకరించాలని కోరారు. అయితే ముకేశ్ చేసిన అభ్యర్థనను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఇదిలావుండగా ఈ కేసులో దోషులకు వేసిన ఉరిశిక్ష ఇప్పటికే మూడుసార్లు వాయిదాపడింది. తాజాగా ఈ నెల 20న ఉరితీయాలని పటియాల కోర్టు డెత్‌వారెంట్ జారీ చేసింది. దీంతో వాళ్లకు శిక్ష నుంచి తప్పించుకునే మార్గాలు మూసుకుపోయాయి.