రాష్ట్రీయం

త్వరలో కొత్త చట్టాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరునెలల్లో రూపకల్పనకు కార్యాచరణ 400 చట్టాలపై న్యాయశాఖ కసరత్తు
హైదరాబాద్, డిసెంబర్ 19: కొత్త చట్టాల ఏర్పాటుకు తెలంగాణలో కసరత్తు ముమ్మరమైంది. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలోని చట్టాలే తెలంగాణలో అమలవుతున్నాయి. అయితే, ఆరునెలల వ్యవధిలో సంపూర్ణంగా తెలంగాణ చట్టాలు అమల్లోకి రానున్నాయి. దీనికి సంబంధించి న్యాయశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో మొత్తం 450 చట్టాలు ఉండగా, విభజన చట్టం ప్రకారం రెండేళ్లపాటు పాత చట్టాలే తెలంగాణకూ వర్తిస్తాయి. అయితే రెండేళ్లలో సొంతంగా తెలంగాణ చట్టాలు రూపొందించుకోవాలి. తెలంగాణ ఏర్పడి ఏడాదిన్నర కావస్తుండగా, ఇప్పటి వరకు 50 చట్టాలను మాత్రమే సవరించి తెలంగాణ చట్టాలుగా రూపొందించారు. మరో 400 చట్టాలను రూపొందించుకోవాల్సి ఉంది.
ఆరునెలల వ్యవధిలో వీటిని పూర్తి చేసేందుకు న్యాయశాఖ ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. పాత చట్టాన్ని పరిశీలించి ఆంధ్రప్రదేశ్ అని ఉన్న ప్రతిచోటా తెలంగాణ అని చేర్చడంతోపాటు కొత్తగా రాష్ట్రానికి అవసరమైన సవరణలు చేస్తూ కొత్తచట్టం రూపొందించేందుకు ఒక్కో చట్టానికి కనీసం రెండు వారాల సమయం పడుతుందని న్యాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం 32 శాఖలుండగా, వీటికి సంబంధించిన 400 చట్టాలను సవరించి తెలంగాణ చట్టంగా రూపొందించాలి. అయితే ఆయా ప్రభుత్వ శాఖల విభాగాల అధికారులతో కమిటీలు వేసి నాలుగు వందల చట్టాలను రూపొందించనున్నట్టు న్యాయశాఖ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తెంలగాణ కోసం కొత్త చట్టాల గురించి మూడు సెక్షన్‌లలో వివరంగా పేర్కొన్నారు. సెక్షన్ 100 ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని చట్టాలు తెలంగాణకు రెండేళ్లపాటు యధావిధిగా వర్తిస్తాయి.
సాధారణంగా చట్టాలను అసెంబ్లీ రూపొందిస్తుంది. కానీ అప్పటి వరకు అమల్లోవున్న ఉమ్మడి రాష్ట్ర చట్టాలను ఆంధ్రప్రదేశ్ అని ఉన్నచోట తెలంగాణ అని చేరుస్తూ జీవో ద్వారా కొత్తచట్టాన్ని తీసుకొచ్చే అధికారం రాష్ట్రానికి 101 సెక్షన్ కల్పించింది. ఒకవేళ రెండేళ్లలో కొత్త చట్టాలు తీసుకురాకపోయినా, అప్పటి వరకు అమల్లోవున్న చట్టేలే తెలంగాణకూ వర్తిస్తాయని 102 సెక్షన్‌లో పేర్కొన్నారు. ఒకవేళ ఏ అంశంపైనైనా కోర్టుకు వెళితే ఉమ్మడి రాష్ట్రంలోని చట్టానికి, కొత్తగా రూపొందించిన చట్టంలో ఏమైనా పొరపాట్లు దొర్లితే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి చట్టానే్న న్యాయస్థానం పరిగణలోకి తీసుకోవాలని సెక్షన్ 102లో ఉంది. దీని ప్రకారం కొత్త చట్టాల రూపకల్పనలో ఇబ్బందులు ఏమీ ఉండవని అధికారులు తెలిపారు. అయితే కొత్త రాష్ట్రం కాబట్టి తెలంగాణ చట్టాలు తెలంగాణ పేరుతోనే ఉండాలనే ఉద్దేశంతో ఆరునెలల్లో ఈ పనులు పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు అధికారులు తెలిపారు. ఆరునెలల్లో చట్టాల రూపకల్పన పూరె్తైన తరువాత తెలంగాణ చట్టాలన్నీంటినీ పుస్తకాల రూపంలో విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు.