నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. పంజరంబునఁ గానిఁ బట్టియుంచిన లెస్స
పలుకునే వింతైన చిలుక పలుకు
గార్ధ్భంబును దెచ్చి కళ్లెమింపుగ నేయ
తిరుగునే గుఱ్ఱంబు తీరుగాను
ఎనుప పోతును మావటటీడు శిక్షించిన
నడచునే మదవారణంబు వలెను
పెద్ద డిట్టకు మేతఁబెట్టి పెంచినఁ గ్రొవ్వి
సాగునే వేటాడు డేగవలెను
తే. కుజనులను దెచ్చి నీ సేవకొరకు ఁబెట్ట
వాంఛతోఁ జేతురే భక్తవరుల వలెను
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: ఓ నరసింహప్రభూ! కాకిని పంజరంలో బంధిస్తే అదిచిలుక పల్కులు పల్కుతుందా? గాడిదకు కళ్లెం తగిలిస్తే అది గుర్రం లాగా తిరుగుతుందా? దున్నకు మావటివానిచే శిక్షణ ఇప్పిస్తే మదపుటేనుగులాగా నడుస్తుందా? పెద్దపీటకు మేత పెడితే డేగ లాగ కొవ్వెక్కి సాగుతుందా? ఇలాగే దుష్టుణ్ణి నీ సేవకు పెడితే సద్భక్తుని వలె ప్రీతితో సేవ చేస్తాడా?