మెయిన్ ఫీచర్

నీతి.. నిజాయతీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాకు మెసెజ్ కొత్త కాదు. సినిమాలో మెసెజ్‌లూ కొత్తకాదు. సర్గయుగపు సినిమాల కాలం నుంచీ -ఆడియన్స్‌కి మెసేజ్‌ల సంస్కృతి నడుస్తూనే ఉంది. నిజానికి సినిమాయే -ఓ మెసెజ్. కథానాయకుడు గొప్పవాడు, ప్రత్యేకమైన వాడు కనుక -చూసేవాళ్లకు ఏదోక నీతి బోధించడం సహజం.
...
తరువాత్తర్వాత మెసెజ్ స్టయిల్ మారింది. చూపించాల్సినంత చెడూ చూపించేసి ఇలా చేస్తే జీవితం ఢమాల్ అని హెచ్చరించే స్టయిల్ మొదలెట్టారు. ఇదేంటి? అని ప్రశ్నించిన సత్తికాలపు ప్రేక్షక సత్తయ్యలకు నిర్మాతలు కొత్త విషయం చెప్పడం ప్రారంభించారు. బూతు చూపిస్తేనే కదా.. నీతి విలువ తెలిసేది అని చెప్పడం మొదలెట్టారు.
...
క్రమంగా మెసెజివ్వడం -మారుతూ వచ్చింది. ఇప్పుడు చెప్తే ఆచరించేవాళ్లు లేరు.
కనుక -చేసి చూపించడం మొదలెట్టారు. స్క్రీన్‌మీదనుంచి చెప్పినంత మాత్రాన -్థయేటర్ బయటికెళ్లిన ప్రేక్షకుడు ఆచరిస్తాడన్న నమ్మకం లేదు కనుక -జనంలోకెళ్లి ఆచరణాత్మక మెసేజ్‌లు ఇవ్వడం మొదలైంది. అదీ -శ్రీమంతుడు నుంచి. అంతా బాగానే ఉంది? కానీ, ఇదెంత కాలం? అన్న ప్రశ్నించేవాళ్లకు మాత్రం సమాధానం దొరకదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండూళ్లైనా.. అంటూ దత్తత కార్యక్రమాలు మొదలైనా.. ఈ సైకిల్ ప్రయాణం ఎంత దూరం? అన్నదే అర్థంకాని విషయం.

సమాజానికి మేలుచేయకపోనా పర్వాలేదు, కీడు చేయకూడదనేది సినిమా సూత్రం. ఈ సూత్రాన్ని తుచ తప్పకుండా వచ్చిన చిత్రాల్తోపాటు, బాధ్యతారాహిత్యంతో వచ్చిన సినిమాలూ ఉన్నాయి. సంవత్సరకాలంలో వందల సంఖ్యలో నిర్మితమయ్యే సినిమాల్లో కొంత మెసేజ్‌ని పాస్ చేయడం ఓ ప్రొడక్షన్ వాల్యూ. అయితే -చూపించాల్సినంతా చూపించేసి నీతులు చెప్పడం సరికాదని విమర్శకులు చెప్పినా బూతువుంటేనే నీతి చెప్పగలమన్నది నిర్మాతలు ఎప్పుడూ చెప్పిన, చెప్తోన్న మాట. ఏదేమైనా చివరన ఏదోక నీతి చెప్పడం చాలా సినిమాలకు కామనైపోయింది. ఇంతకీ ఇదంతా ఫాలోకావాల్సింది ప్రేక్షకులే. వీరు ఎంతవరకు ఫాలో అవుతారు? అంటే అదీ ఓ ప్రశే్న! అందుకే కొంతకాలం నీతులను ఫ్యాన్స్‌కోసమే బోధించడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఆ పరిస్థితీ చేయిదాటిపోయింది. గుండెల్లో అభిమానం మెండుగావున్నా సినిమాను ఆచితూచి చూసే పరిస్థితి వచ్చేసింది. వరకట్న దురాచారం.. కుల మత విద్వేషాలు.. లంచగొండితనం.. ఇలా ఒకటేమిటి? సినిమా కథకు కాదేదీ అనర్హం అన్నట్టు తయారైంది. నీతి బావుంటే సినిమాలో ఎవరు నటించినా చూసే పరిస్థితి కొంతకాలం నడిచింది. పెద్ద హీరోలు నీతులు చెపితే ఫాలో అయ్యేకాలం కొంతవరకూ నడిచింది. ఇప్పుడు ప్రేక్షకుడూ బిజీయే! పైగా ఒకరు చెప్పింది ఫాలోకావడమేమిటి? మన స్టయిల్లో మనం ఫాలో అయ్యి -మనం కూడా రియల్ హీరో అవుదామనే ఆలోచన కనిపిస్తోంది. అందుకే సినిమా నీతులు సెల్యూలాయిడ్‌పైనే బావుంటున్నాయి. పంఛ్‌ల వరకే పరిమితం అవుతున్నాయి.
స్వర్గయుగం సినిమా కాలాన్ని పక్కనపెడితే -రాష్ట్రాన్ని వన్‌డే పాలించే సిఎం కథతో ఒకే ఒక్కడు వచ్చింది. లంచగొండితనంపై భారతీయుడు మొదటవస్తే -దానికి మరో కోణంలో అపరిచితుడు, ఠాగూర్ వచ్చాయి. ఊరిని ఉద్ధరించే దిశగా శివాజీ వచ్చింది. ఇలా వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ టాప్ హిట్లే! ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసినవే! కామన్ ప్రేక్షకుడు బ్రహ్మరథం పట్టినవే. పదే పదే ఆ విషయాలను చర్చించుకున్నారు. మెల్లమెల్లగా మరచిపోయి జీవించేస్తున్నారు. ప్రేక్షకులు ఫాలోఅవుతారనే భ్రమలో మాత్రం హీరోలు వుంటారు. అలాంటి హీరోలే రియల్ హీరోలుగా రంగంలోకి దూకితే?! అదే ‘శ్రీమంతుడు’!
ప్రజలు ఆపదలోవుంటే జోలి పడతారు. ఆటలు ఆడి సైతం ఫండ్ పోగేస్తారు. స్వచ్ఛందంగా నిధులిస్తారు. అయినా ఆశించిన మార్పురాదు. ఎందుకంటే ప్రేక్షకుడు ఎప్పుడూ ప్రేక్షకుడే! అన్నీ డబ్బులబట్టే చూస్తాడు. ఈ హీరోల త్యాగాల వెనుక విమర్శలు కూడా ఉంటాయి. ఇప్పుడు నీతులు చెప్పడం కాదు, ఏకంగా ప్రేక్షకులను దత్తత (ఊరిని) తీసుకునే కానె్సప్ట్ శ్రీమంతుడు రూపంలో తెరపైకొచ్చింది.
తొలిసారిగా సొంత బ్యానర్‌తో వచ్చిన మహేష్‌బాబుకి శ్రీమంతుడు అనూహ్య విజయాన్ని అందించింది. ఏకంగా దర్శకుడి కోటి రూపాయల కారును గిఫ్ట్‌గా ఇచ్చేంత ఆనందం కలిగింది. అదే ఊపులో ఏకంగా సినిమా కథనే నిజం చేయాలనే సంకల్పంతో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్‌లో రెండు ఊళ్లను దత్తత తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఈ బాటలో తన సేవాసంస్థతో ఓ కుర్ర ఔట్‌డేట్ హీరోతోపాటు విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ సైతం అడుగులు వేశారు. ఇదీ శ్రీమంతుడు కదిలించిన నీతి. ఇది ఎంతకాలం సక్రమంగా జరుగుతుందనేది ప్రేక్షకులు సైతం గమనించరు.
ప్రస్తుతం పాలకుల కానె్సప్ట్ కూడా దత్తతే. వార్డులను, గ్రామాలను దత్తత తీసుకోమని ప్రచారం చేస్తున్నారు. అంటే శ్రీమంతులు తమవంతు ఖర్చులు చేయమని అర్థం. దీన్ని ఫాలోఅయ్యే వారెందరు? నిజంగా ఫాలో అయితే ఫలితాలను విశే్లషించే వారెవరు? సచిన్ తీసుకున్న దత్తత గ్రామం ‘నిర్మల్ కేంద్ర పురస్కారం’ అందుకుంది. కానీ దాని గురించి ప్రజలకు ఎంత తెలుసు? అంటే తెలియదనే చెప్పాలి. హుదూద్ తుపాను విపత్తులో క్రికెట్ మ్యాచ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని సైతం గ్రామాభివృద్ధికే దత్తత తీసుకుని ఉపయోగించమని ఆ సినీ క్రికెట్ క్రీడాకారులకు సిఎం చెప్పడం గమనార్హం! ఇలాంటివన్నీ చూస్తున్న సినీ ప్రేక్షకులకు రొటీన్‌గా అనిపిస్తాయి. రెండున్నర గంటల సినిమా చూసినట్టే అనిపిస్తుంది. పైగా ఇలాంటి వాటికోసం కాల్షీట్ల కోసం ఎదురుచూసే నిర్మాతలే ఖర్చు చేస్తారనే వాదనలూ ప్రేక్షకుల మధ్య వినిపిస్తాయి.
సినిమా నీతులను, ఆదర్శాలను ఖచ్చితంగా ఫాలో అయ్యే ప్రేక్షకులు వుంటే సమాజం శాంతి సౌభాగ్యాలతో తులతూగుతూ ఉండేదన్నది సినిమా వాళ్లు చెప్పే పచ్చి నిజమే. అది ఒప్పుకోతగ్గ సత్యం కూడా. సినిమా రెండున్నర గంటలు దాటిన తర్వాత కొంతవరకే ప్రేక్షకుడిని వెంటాడగలదు. ఆ తర్వాత కొత్త సినిమా కోసం ఎదురుచూడటం ప్రేక్షకుడి వంతు. సినిమాల్లో హీరోలు చేసే సాహసాలకు, త్యాగాలకు, సహాయాలకు టికెట్‌కొని మరీ చప్పట్లు కొడతారే తప్ప నిజజీవితంలో వాటిని ఫాలో కావాలని, తమ హీరోలు ఫాలో అవుతున్నారని ప్రజలు విశ్వసించరన్నది వాస్తవం.

-పోలిశెట్టి