జాతీయ వార్తలు
ఎడారిని తలపించిన ముంబయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ముంబయి, మార్చి 22: దేశ వాణిజ్య రాజధాని ముంబయి ఆదివారం ఏడారిని తలపించింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని ప్రధాన మంత్రి మోదీ ఇచ్చిన పిలుపునకు ముంబయి ప్రజలు అనూహ్యంగా స్పందించారు. జనతా కర్ఫ్యూను విజయవంతం చేశారు. ఎప్పుడు జనసమ్మర్ధంతో ఉండే ముంబయిలోని అనేక ప్రాంతాలు ప్రజల సందడి లేక నిశ్శబ్దం రాజ్యమేలింది. నిత్యం పర్యాటకులు, స్థానికులతో కిటకిటలాడే ప్రసిద్ధ గేట్ ఆఫ్ ఇండియా, జుహు బీచ్, బాద్రా-వర్లి తీర ప్రాంతం జనం లేక మూగబోయాయి. ఎక్కడి రైళ్లు అక్కడ ఆగిపోయాయి. ప్రగతి రథచక్రానికి సైతం బ్రేకులు పడ్డాయి. ఇక వేలాది మందితో కిటకిటలాడే ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్, ఇతర సబర్బన్ స్టేషన్ల సంగతి సరేసరి. ముంబయి సబర్బన్ స్టేషన్లలో వేలాది మంది జనంతో కిక్కిరిసిపోయే రైళ్లు ఒక్క రోజు పాటు విశ్రాంతి తీసుకున్నాయా? అనిపించే దిశగా మూగబోయి కనిపించాయి. ఇలా ఒక్క ప్రాంతం అని కాకుండా అన్ని ప్రాంతాలూ జన సందడి లేక బోసిపోయాయనే చెప్పాలి. దాదర్, అంధేరి, బొరివలి, ఘట్కోపర్, బంద్రా-కుర్లా కాంప్లెక్స్ వంటి రద్దీ ప్రాంతాలు సైతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇచ్చిన ‘జనతా కర్ఫ్యూ’ పిలుపునకు జనం స్పందించడంతో ఎక్కడా మనిషి జాడ కరువైందనే చెప్పొచ్చు. ఏనాడు గాఢ నిద్రకు నోచుకోని.. ప్రకృతి విపత్తులకు ఆలవాలమైన.. మానవ తప్పిదాలు, టెర్రరిస్టు దాడులు తదితర ఘటనల నేపథ్యంలో సైతం జన సంచారం ఎక్కడా తగ్గేది కాదు.. అలాంటిది యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి అనూహ్యంగా ఎక్కడికక్కడ ప్రజలను ఇళ్లకే పరిమితమయ్యేలా చేసిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చైనాలో ప్రారంభమై ఇటలీ, ఇరాన్, అమెరికా తదితర 175 రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి బారిన భారత్‌లో ఇప్పటివరకు ఏడుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపునకు ముంబయి ప్రజలు అనూహ్యంగా స్పందించి విజయవంతం చేశారడంలో ఎలాంటి సందేహం లేదు.
*చిత్రం... కరోనా వైరస్‌పై పోరాడుతున్న వైద్యులకు ఆదివారం ముంబయలో కరతాళ అభినందన చేస్తున్న అమితాబచ్చన్ ఆయన కుటుంబ సభ్యులు