జాతీయ వార్తలు
జామియా ‘నిరసన ప్రదేశం’పైకి పెట్రోల్ బాంబు విసిరిన దుండగుడు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, మార్చి 22: ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటి క్యాంపస్ బయట గల ఖాళీగా ఉన్న ‘నిరసన ప్రదేశం’పైకి ఆదివారం ఒక గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో పాటు పెట్రోల్ బాంబు విసిరాడు. యూనివర్శిటి అధికారులు, విద్యార్థులు ఈ విషయం తెలిపారు. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరి (ఎఫ్ఎస్ఎల్)కు చెందిన ఒక బృందం సంఘటన స్థలాన్ని తనిఖీ చేసిందని, ఈ ఘటనపై జామియా నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని డిప్యూటి పోలీసు కమిషనర్ (ఆగ్నేయ)) ఆర్పీ మీనా తెలిపారు.
‘జామియా మిలియా ఇస్లామియా గేట్ నెంబర్ 7కు చెందిన డివైడర్ సమీపంలో గల సంఘటన స్థలంలో ఒక పగిలిన బాటిల్, ఒక లైటర్, ఒక ఖాళీ కాట్రిడ్జ్ లభించాయి’ అని ఆయన వివరించారు. నిందితుడిని గుర్తించడానికి పలు బృందాలను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. యూనివర్శిటీ ప్రస్తుత, మాజీ విద్యార్థులతో కూడిన జామియా కోఆర్డినేషన్ కమిటి (జేసీసీ) పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా వర్శిటీకి సమీపంలో నిరసన వ్యక్తం చేస్తూ వచ్చింది. అయితే దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జేసీసీ తన నిరసనను శనివారం నుంచి తాత్కాలికంగా నిలిపివేసింది. జామియా చౌరస్తాకు వద్ద గల నిరసన ప్రదేశంపైకి దుండగుడు కాల్పులు జరపడంతో పాటు ఒక పెట్రోల్ బాంబు విసిరాడని జేసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే ఆ దుండగుడు డెలివరీ బాయ్ వేషంలో ఉన్నాడని, అతని బైక్‌పై ఒక హెల్మెట్, మూడు బ్యాగులు కనపడుతున్నాయని జేసీసీ తన ప్రకటనలో వివరించింది. ‘పోలీసులు బుల్లెట్‌ను తీసికెళ్లారు. పగిలిపోయిన గ్లాస్ బాటిల్ ముక్కలు ఇంకా అక్కడే ఉన్నాయి’ అని తెలిపింది. ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఈ సంఘటన జరిగిందని యూనివర్శిటీకి చెందిన ఒక అధికారి తెలిపారు.
‘ఓఖ్లా వైపు నుంచి వచ్చిన ఆ వ్యక్తి బహుశా అంతకు ముందు షహీన్‌బాగ్ వద్ద ఇదే రకమయిన చర్యకు పాల్పడి ఉంటాడు. అతను వర్శిటీ గేట్ నెంబర్ 7కు సమీపంలో గల టెంట్ వద్దకు ఒక బాటిల్ విసిరాడు. విద్యార్థులు తమ ఆందోళన కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసుకోవడంతో ఆ టెంట్ ఖాళీగా ఉంది. అయితే, ఆ టెంట్‌కు మంటలు అంటుకోకపోవడంతో ఆ వ్యక్తి లైటర్ సాయంతో టెంట్‌కు నిప్పు పెట్టడానికి ప్రయత్నించాడు. పలు రౌండ్లు కాల్పులు జరిపాడు’ అని యూనివర్శిటి అధికారి తెలిపారు. పోలీసులకు సమాచారం అందించి, సీసీటీవీ ఫుటేజీని అందజేయడం జరిగిందని ఆయన చెప్పారు.