జాతీయ వార్తలు
భారత్ త్వరగా కరోనాపై గెలవాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ కరోనా మహమ్మారిపై త్వరగా విజయం సాధించాలని భారత్లో చైనా రాయబారి సన్ వెయిడాంగ్ ఆదివారం ఆకాంక్షించారు. ‘కోవిడ్-19కు వ్యతిరేకంగా సాగుతున్న యుద్ధంలో తమ సేవలు అందించిన వారికి అభినందనలు. కరోనా సాంక్రమిక వ్యాధిపై భారత్ త్వరగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని వెయిడాంగ్ సామాజిక మాధ్యమం ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 340కి పైగా పెరిగింది. దేశంలో ఇప్పటి వరకు ఈ వైరస్ కారణంగా ఏడుగురు మృతి చెందారు. ప్రాణాంతకమయిన కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి దేశంలోని అనేక రాష్ట్రాలు సంపూర్ణంగా లేదా పాక్షికంగా మూతపడ్డాయి.