జాతీయ వార్తలు
‘మహా’లో 144 సెక్షన్ నిషేధాజ్ఞలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ముంబయి, మార్చి 22: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పూర్తిగా కట్టడి చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. సోమవారం నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఆదివారం విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఐదుగురికి మించి గుమిగూడ వద్దని ఆయన సూచించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) బస్సులు, ప్రైవేటు రవాణా వాహనాలను పూర్తిగా నిలిపి వేస్తున్నట్లు ఆయన చెప్పారు. అత్యవసర సిబ్బంది, అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. బ్యాంకులు, కూరగాయల మార్కెట్లు, షేర్ మార్కెట్లు యధావిధిగా తెరిచే ఉంటాయని ఆయన తెలిపారు. కరోనా వైరస్ నుంచి ప్రతి ఒక్కరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. అందుకే ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రం హోం) చేయాల్సిన సర్వీసులను ప్రోత్సహించాలని ఆయన చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో ఈ నెలాఖరు వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని, అవసరమైతే ఇంకా పొడిగిస్తామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. వైరస్ అనుమానితులు, సొంతంగా ఇళ్ళలోనే ఉంటూ చికిత్స పొందుతామనుకుంటున్న వారు కుటుంబ సభ్యులతో కలవకుండా దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి థాక్రే సూచించారు. ఎవరికైనా వైరస్ సోకినట్లు అనుమానం కలిగినా, లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని ఆయన తెలిపారు. పరిశ్రమలు మూసి వేయాలని ఆయన యాజమాన్యాలను కోరారు. దినసరి వేతనాలపై పని చేసే కార్మికులకు మానవతా థృక్ఫథంతో వేతనాలు చెల్లించాలని ఆయన కోరారు. పట్టణ ప్రాంతాల్లో అత్యవసర సర్వీసులు మినహా అన్నింటినీ మూసి వేయాలని ఆయన ఆదేశించారు. అంతర్జాతీయ విమానాల రాకపోకలపై కేంద్ర ప్రభుత్వం ఇదివరకే రద్దు చేసిందని ఆయన వివరించారు.