జాతీయ వార్తలు
ఇంట్లోనే ఇండియా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ/ముంబయి: ప్రాణాంతకంగా పరిణమిస్తున్న కరోనా వైరస్‌పై యావత్ భారతావని రణన్నినాదం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు జనంలో అనూహ్యమైన, అసాధారణమైన ప్రతిస్పందనకు దారి తీసింది. జనం అంతా ఒక్కటిగా కరోనాను దరి చేరనివ్వమం టూ ఇళ్ళకే పరిమితమై ఓ ఆదర్శనీయ సందేశాన్ని అందించారు. వ్యక్తుల మధ్య సామాజిక దూరాన్ని పాటించాలన్న సందేశాన్ని త్రికరణ శుద్ధిగా పాటించారు. ఎవరూ గుమ్మం దాటకూడదంటూ మోదీ ఇచ్చి న పిలుపును ప్రతి ఒక్కరూ పాటించారు. ఆ విధంగా యావత్ ఇండియా ‘ఇంటి’కే పరిమితమైంది. కరోనా వైరస్‌పై తాము చేపట్టిన యుద్ధంలో ఇది తొలి భాగమేనని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు స్పష్టం చేశా రు. జనతా కర్ఫ్యూకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఆయన ‘ఈ మహామ్మారి వ్యాపించకుండా ఉండాలంటే వ్యక్తుల మధ్య సామాజిక దూ రం నిర్బంధంగా ఉండాలి. ఈ నియమాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి’ అని స్పష్టం చేశారు. ఢిల్లీ, ముంబయి, అహ్మదాబాద్, పాట్నా, అలహాబాద్ ఇలా దేశం అంతా కూడా రహదారులు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, వ్యాపార సంస్థలు మూగబోయాయి. అయితే 14 గంటల జనతా కర్ఫ్యూ పరిథి నుంచి కొన్ని అత్యవసర సర్వీసులను మినహాయించారు. అవి మాత్రమే పని చేశాయి. ఆదివారం ఉదయం 7 గంటలకు మొదలైన ఈ కర్ఫ్యూ రాత్రి 9 వరకూ పూర్తి స్థాయిలో సాగింది. కొందరు ప్రభుత్వ ఆంక్షల ను పట్టించుకోకుండా బయటకు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నప్పటికీ వారిని వారించి పోలీసులు వెనక్కి పంపారు. ఢిల్లీలో అయితే ఇలాంటి వారి చేతికి పువ్వు అందిస్తూ పోలీసులు అభ్యర్థించారు. కొన్ని చోట్ల పోలీసులే ప్రజలకు మాస్క్‌లు, శానిటైజర్లు అందించి కరోన వైరస్ గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ‘ఈ రోజు మనం కరోనాపై పోరాటంలో భాగంగా జనతా కర్ఫ్యూ పాటించాం, అంత మాత్రాన ఈ వైరస్ అంతమైనట్లు కాదు, దీనిపై జరిగే పోరాటంలో ఇది తొలి అడుగే, ప్రజలందరూ ఇళ్ళకే పరిమితం కావడం ద్వారా తమ శక్తిని, యుక్తిని చాటి చెప్పారు’ అని ప్రధాని మోదీ అన్నారు. లాక్‌డౌన్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలే స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించడం వల్ల దేశం అంతా కూడా వీధులన్నీ వెలవెలపోయాయి. దేశవ్యాప్తంగా అనేక దేవాలయాలను మూసి వేశారు. ప్రధాని మోదీ పిలుపు నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా జనతా కర్ఫ్యూకు సహకరించారని, ప్రజలకు పిలుపునివ్వడంతో కూడా ఈ అనూహ్య స్పందనకు కారణమైంది. పార్టీ విధేయలతో సంబంధం లేకుండా ఈ కరోన వ్యతిరేక పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. ఆ విధంగా సమైక్య భారత శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. ఎక్కడి నుంచి కూడా రైళ్ళు కదలకపోవడంతో దేశ వ్యాప్తంగా రైల్వే వ్యవస్థ ఆగిపోయింది. ఈ మహామ్మారిపై పోరాటం సామాజిక స్పృహ ప్రజల్లో బలంగా ఏర్పడడంతో ఎవరికి వారుగా స్వీయ నియంత్రణ చర్యలను చేపట్టారు. ఆంక్షలను ఉల్లంఘిస్తే నష్టం తమకేనన్న భావన ప్రతి పౌరుడిలోనూ కనిపించడం వల్లే జనతా కర్ఫ్యూ కరోన వైరస్‌పై ఉక్కుపిడికిలి బిగించడానికి సాధ్యమైంది.