జాతీయ వార్తలు
ఉత్పాదకతకు ఊతం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, మార్చి 21: దేశంలో ఎలక్ట్రానిక్ పరిశ్రమల ఆభివృద్ది, భారీ మందుల తయారీ పరిశ్రమల పార్కుల అభివృద్ధికి ఉద్దేశించిన పలు కీలక నిర్ణయాలను కేంద్ర మంత్రివర్గం తీసుకున్నది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నది. దేశంలో ఎలక్ట్రానిక్ విడి భాగాలు, సెమికండక్టర్ల ఉత్పత్తిని పెంచేందుకు పలు ప్రోత్సాహకాలను మోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఎలక్ట్రానిక్ విడి భాగాలు, సెమి కండక్టర్ల ప్రోత్సాహక పథకంలో భాగంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థకు పెట్టుబడి ఖర్చులో 25 శాతం ఆర్థిక ప్రోత్సాహకాలను మోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఎలక్ట్రానిక్ విడి భాగాలు, సెమి కండక్టర్ల దేశీయ ఉత్పత్తి వ్యవస్థలో ఉన్న లోపాలను ఈ ప్రోత్సాహకాలు సరిదిద్దుతాయని ప్రభుత్వం చెబుతోంది. ఎలక్ట్రానిక్ విడి భాగాలు, సెమి కండక్టర్లను ఉత్పత్తి చేసే దేశీయ పరిశ్రమలకు 25 శాతం ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడం మూలంగా కేంద్ర ప్రభుత్వంపై దాదాపు 3,252 కోట్ల భారం పడుతుంది. కేంద్ర ప్రభుత్వం నేడు తీసుకున్న ఈ నిర్ణయం మూలంగా దేశంలో ఎలక్ట్రానిక్ రంగం అభివృద్ది చెందటంతోపాటు ఈ రంగంలో దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల అదనపు పెట్టుబడులు వస్తాయి, ఇంకా ఒక లక్షా యాభై వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మున్ముందు మొత్తం అరు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. దేశంలోని మోడిఫైడ్ ఎలక్ట్రానికి మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లకు ఆర్థిక సహాయం చేయాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ఈ పథకం మూలంగా కేంద్ర ప్రభుత్వంపై 3,762 కోట్ల ఆదనపు భారం పడుతుంది. అయితే ఈ పథకత మూలంగా దేశంలో ఎలక్ట్రానికి మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, కామన్ ఫెసిలిటీ కేంద్రాల ఏర్పాటు పెద్ద ఎత్తున జరుగుతుందని ప్రభుత్వ భావిస్తోంది. ప్రాథమిక సౌకర్యాలు ఇప్పుడిప్పుడే అభివృద్ది చెందుతున్న వెనుకబడిన ప్రాంతాల్లో ఈ సెంటర్లను ప్రోత్సహిస్తారు. ఈ పథకానికి 3,762 కోట్ల రుపాయలు ఖర్చు చేస్తారు. భారీ ఎలక్ట్రానికి ఉత్పత్తి పరిశ్రలలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకాలను ఇచ్చేందుకు మంత్రివర్గం ఆనుమతి మంజూరు చేసింది. ఈ పథకం కింద నాలుగు నుండి ఆరు శాతం ఆర్థిక ప్రోత్సాహకాలు అందజేస్తారు. దేశంలో వైద్య పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు వందల కోట్ల రూపాయల వ్యయంతో దేశంలో నాలుగు వైద్య పరికరాల ఉత్పత్తి పార్కులను ప్రోత్సహించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. వైద్య పరికరాల పార్కుల ఏర్పాటుకు రానున్న నాలుగు సంవత్సరాల్లో నాలుగు వందల కోట్లరూపాయలు ఖర్చు చేస్తారు. 2018-19లో దాదాపు 50,026 కోట్ల విలువ ఉన్న వైద్య పరికరాల ఉత్పత్తి రంగం 2021-22 నాటికి 86,840 కోట్లకు పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో వైద్య పరికరాల పార్కులను కేంద్ర ప్రభు త్వం ప్రోత్సహిస్తుంది. ప్రతి వైద్య పరికరాల పార్కు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు వంద కోట్ల రూపాయల గ్రాంటును అందజేస్తుంది. మందుల పరిమ్రలకు అవసరమైన కీలక స్టార్టింగ్ మెటీరియల్స్, డ్రగ్ ఇంటర్‌మీడియట్స్, ఆక్టివ్ పార్మాసూటికల్ ఇంగ్రీడియంట్స్ ఉత్పత్తిని దేశంలో ప్రోత్సహించించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. దాదాపు మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో మూడు భారీ మందుల ఉత్పత్తి పార్కులను ప్రోత్సహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. 6,940 కోట్ల రూపాయల వ్యయంతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకల పథకాన్ని అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రానున్న ఎనిమిది సంవత్సరాల్లో కీలక కె.ఎస్.ఎం మందుల మధ్యంతరాలను ఈ పథకం కింద ప్రోత్సహిస్తారు.