జాతీయ వార్తలు
రూ.వెయ్యి చొప్పున కార్మికులకు సాయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
లక్నో, మార్చి 21: కరోనా వైరస్ మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని సుమారు 35 లక్షల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 1,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. అలాగే 1.65 కోట్ల మంది నిర్మాణ రంగ కార్మికులకు ఒక నెల కోసం రేషన్‌ను ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్ కార్మికులకు చెల్లింపులను వెంటనే విడుదల చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. నగరాలు, గ్రామాలలో పేదలకు ఆహార ధాన్యాలను అందుబాటులో ఉంచాలని కూడా ఆయన ఆదేశించారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ఒక ప్రకటన ఈ విషయం వెల్లడించింది. ‘కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి, నియంత్రించడానికి దేశవ్యాప్తంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 35 లక్షల మంది కార్మికులకు మెయింటెనెన్స్ కోసం ఒక్కొక్కరికి రూ. 1,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తుంది.
ఈ సొమ్మును నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయడం జరుగుతుంది’ అని ఆ ప్రకటన తెలిపింది. అంత్యోదయ యోజన, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్) కింద కార్మిక శాఖ వద్ద తమ పేర్లు నమోదు చేసుకున్న నిర్మాణ కార్మికులకు, రోజువారీ కూలీలకు ఏప్రిల్ నెలలో ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని కూడా యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారని ఆ ప్రకటన తెలిపింది. రేషన్ కార్డులు లేని పట్ణణ ప్రాంతాలలోని దినసరి కూలీలకు వాటిని ప్రాధాన్యతతో ఇవ్వడం జరుగుతుందని పేర్కొంది.