జాతీయ వార్తలు
ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, సీఏఏలనూ నిరసించాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, మార్చి 21: ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో ఆదివారం ప్రజలు ఆరోగ్య సంరక్షకులకు, అత్యవసర పరిస్థితుల్లో స్పందిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలుపనుండగా, అదే సమయంలో దేశ రాజధాని ప్రాంతంలోని అనేక మంది కొత్త కోవిడ్-19 మహమ్మారి కారణంగా జాతీయ పౌర రిజిస్టరు (ఎన్పీఆర్)ను తాజాపరచాలనే తన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తమ ఇళ్లలో నిలబడి చప్పట్లు కొట్టనున్నారు. గంటలు మోగించనున్నారు. నినాదాలు ఇవ్వనున్నారు. జాతీయ పౌర రిజిస్టరు (ఎన్ఆర్సీ), జాతీయ జనాభా రిజిస్టరు (ఎన్పీఆర్), పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)లకు వ్యతిరేకంగా ప్రజలు ఆదివారం సాయంత్రం అయిదు గంటలకు తమ బాల్కనీలు, కిటికీలు, గేట్ల వద్ద నుంచి తమ నిరసన వ్యక్తం చేయాలని అసహన వ్యతిరేక ఐక్య పౌర సమాజ బృందం కోరింది. ఆదివారం నాడు ప్రజలు తమకు తాముగా కర్ఫ్యూ విధించుకొని ఇళ్లలోనే ఉండిపోవాలని, కరోనా మహమ్మారిపై అగ్ర భాగాన ఉండి పోరాడుతున్న ఆరోగ్య సంరక్షకులకు, అత్యవసర పరిస్థితుల్లో స్పందిస్తున్న వారికి కరతాళ ధ్వనులు చేయడం ద్వారా కృతజ్ఞతలు తెలపాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంతకు ముందే పిలుపునిచ్చారు. ‘మనం తొలుత కరోనా వైరస్ సోకిన వారి ఆరోగ్యాన్ని కాపాడటానికి కృషి చేస్తున్న, అవసరమైన సరుకులను సరఫరా చేస్తున్న మన సోదరీమణులు, సోదరులకు కృతజ్ఞతలు తెలపాలి.. అనంతరం మనం మన బాల్కనీలు, కిటికీలు, గేట్ల వద్ద నిలబడి ఎన్ఆర్సీ వ్యతిరేక, సీఏఏ వ్యతిరేక ప్లకార్డులు ప్రదర్శించాలి. ఏప్రిల్ ఒకటో తేదీనుంచి ఎన్పీఆర్ కార్యక్రమాన్ని నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి’ అని ‘యునైటెడ్ అగేనిస్ట్ హేట్’కు చెందిన నదీమ్ ఖాన్ కోరారు. ప్రభుత్వ ప్రాధాన్యత వైరస్ ముప్పును ఎదుర్కోవడంపై ఉండాలని, ‘దీనికోసం మేమంతా కలిసి వస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.