జాతీయ వార్తలు

‘నిర్భయ’కు న్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: నిర్భయకు ప్రత్యక్ష నరకాన్ని చూపించిన నలుగురు మృగాళ్లను శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఉరి తీసేందుకు రంగం సిద్దమైంది. నలుగురు నిర్భయ దోషులు అక్షయ్ కుమార్ ఠాకూర్ (31), పవన్‌గుప్తా (25), వినయ్ శర్మ (26), ముకేష్ సింగ్ (32) దాఖలు చేసిన అన్ని పిటిషన్లను పటియాలా కోర్టు కొట్టివేయటంతో ఉరి శిక్ష అమలుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ తన రెండో క్షమాభిక్ష పిటిషనను కొట్టివేయటాన్ని సవాల్ చేస్తూ అక్షయ్ కుమార్ ఠాకూర్ చేసిన పిటిషర్‌ను కూడా సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. తమను ఉరి తీసే బదులు చైనా సరిహద్దులోని డోక్లామ్ లేదా భారత-పాకిస్తాన్ సరిహద్దులకు పంపించాలంటూ ముగ్గురు దోషులు వినయ్‌శర్మ, ముకేష్ సింగ్, అక్షయ్ ఆఖరు నిమిషం ప్రయత్నంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషను దాఖలు చేశారు. ముద్దాయిల తరఫున న్యాయవాది ఏపీ సింగ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. నలుగురు ముద్దాయిలకు సంబంధించిన ఎలాంటి పిటిషన్లు ఏ కోర్టులో కూడా పెండింగ్‌లో లేనందున శుక్రవారం ఉదయం తీహార్ జైలులో ఉరి అమలు చేసేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇలాఉంటే నిర్భయ దోషులను ఉరి తీసేందుకు ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ నుండి ప్రత్యేకంగా రప్పించిన పవన్‌కుమార్ జల్లాద్ ఇప్పటికే డమీ ఉరితీత ప్రకియను నిర్వహించాడు. అన్ని సక్రమంగా ఉన్నాయా? లేదా? అనేది పరిశీలించాడు. దోషులు పవన్ కుమార్ గుప్తా, అక్షయ్ ఠాకూర్ పెట్టుకున్న రెండోక్షమాభిక్ష పిటిషన్లను కూడా రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ కొట్టివేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్
ఇర్ఫాన్ అహ్మద్ పటియాలా కోర్టుకు తెలిపారు. నిర్భయ దోషుల తరఫున న్యాయవాదులు వంద దరఖాస్తులు పెట్టుకున్నా అవి న్యాయపరమైన పరిష్కారాలు కావుకాబట్టి ఉరితీత తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే అక్షయ్ ఠాకూర్ నుంచి తనకు విడాకులు ఇప్పించాలంటూ బిహార్‌లోని ఔరంగబాద్ జిల్లా స్థానిక కోర్టులో కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అతడి భార్య పునీతాదేవి పటియాలా కోర్టు వెలుపల పడిపోయా నానా హంగామా సృష్టించింది. అక్షయ్‌ను ఉరి తీస్తే తనకు విడాకులు ఎలా లభిస్తాయంటూ ఆమె కోర్టు వెలుపల గొడవకు దిగింది. అక్షయ్ కుమార్‌తో తనను, తన కుమారుడిని కూడా ఉరితీయాలని ఆమె డిమాండ్ చేశారు. పునీతాదేవి తనను తాను తన చెప్పుతో కొట్టుకుంటూ గత ఏడు సంవత్సరాల నుంచి తమను ప్రతిరోజు ఉరి తీస్తున్నారని నానా యాగీ చేసింది.
ఇలా ఉండగా ఉరి శిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు నలుగురూ న్యాయవాది ఏపీ సింగ్ ద్వారా అన్ని కోర్టులను ఆశ్రయించారు. సుప్రీం కోర్టు, ఢిల్లీ హై కోర్టు, పటియాలా కోర్టు, బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లా కోర్టుతో పాటు అంతర్జాతీయ న్యాయ స్థానంలో రకరకాల పిటిషన్లు దాఖలు చేశారు. నిర్భయ సంఘటన జరిగినప్పుడు తాను ఢిల్లీలో లేనంటూ ముకేష్ సింగ్ కోర్టును తప్పుదోవ పట్టించేందుకు విఫల యత్నం చేశాడు. తమకున్న న్యాయపరమైన అవకాశాలు ఇంకా పూర్తి కాలేదని ఒకడు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే మరోకడు తన న్యాయపరమైన అవకాశాలను పునుద్ధరించాలని న్యాయస్థానాన్ని కోరిన సంగతి తెలిసిందే. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌ను క్షమాభిక్ష కోరడంలో కూడా నలుగురు ముద్దాయి తరఫున అడ్వొకేట్ వ్యూహాత్మకంగా వ్యవహరించటం తెలిసిందే. ఒకరి తరువాత మరొకరి క్షమాభిక్ష పటిషన్లను పంపించటం ద్వారా ఉరి శిక్ష అమలును రెండు నెలల పాటు వాయిదా వేయించుకోగలిగారు. నిర్భయ దోషులు నలుగురూ చట్టాలను దుర్వినియోగం చేయటం ద్వారా ఇప్పటికి మూడు సార్లు ఉరిశిక్ష తేదీలను వాయిదా వేయించుకోగలిగారు. అయితే శుక్రవారం ఉదయం ఐదున్నర గంటలకు ఉరితీత ప్రక్రియ నుంచి ఏ మాత్రం తప్పించుకునే అవకాశాలు కనిపించటం లేదు. ఆరుగురు మానవ మృగాలు 2012 డిసెంబర్ 16 తేదీనాడు బస్సులో 23 సంవత్సరాల మెడికోను అత్యంత దారుణంగా రేప్ చేసి నగరం వెలుపల పడవేసి వెళ్లటం తెలిసిందే. నిర్భయతో ఉన్న ఆమె స్నేహితుడిని అమానుషంగా కొట్టి బస్సు నుంచి నెట్టివేసి పైశాచిక ఆనందం పొందారు. అత్యంత క్రూరమైన రక్షసత్వానికి గురైన యువతి కొన్ని రోజులకు సింగపూర్ ఆసుపత్రిలో చనిపోయింది. నిర్భయను బస్సులో దారుణంగా రేప్ చేసిన ఆరుగురిలో ఒకడు మైనర్ కావటంతో వాడిని మూడేళ్లు రిఫార్మ్ హౌజ్‌లో ఉంచిన తరువాత విడుదల చేశారు. ప్రధాన సూత్రధారి రామ్‌సింగ్ తీహార్ జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
మిగతా నలుగురు దోషులకు శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఉరి శిక్ష అమలు చేస్తున్నారు. శిక్ష అమలులో జాప్యం జరిగినా... ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఉరి తీయటం ద్వారా నిర్భయకు న్యాయం కల్పిస్తున్నారు.