జాతీయ వార్తలు
వృద్ధులు, పిల్లలు బయటకు రాకండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ: నావల్ కరోనా వైరస్ లేదా కోవిడ్-19 విస్తరించకుండా కేంద్ర ప్రభుత్వం మరికొన్ని చర్యలను గురువారం ప్రకటించింది. ఇప్పటికే తీసుకున్న చర్యలకు తోడుగా తాజాగా మరికొన్ని నిర్ణయాలను తీసుకున్నారు. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.
65 సంవత్సరాలు నిండిన వృద్ధులు తమ ఇళ్లల్లోనే ఉండాలి. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, మెడికల్
ప్రొఫెషనల్స్‌కు ఈ సూచనలు వర్తించవు. అలాగే 10 సంవత్సరాలలోపు పిల్లలను కూడా ఇంట్లోనే ఉంచాలి. బయటకు రాకుండా తల్లిదండ్రులు, పెద్దలు చర్యలు తీసుకోవాలి.
* భారతదేశానికి వచ్చే వాణిజ్యపరమైన అంతర్జాతీయ విమానాలన్నింటినీ ఈ నెల 22 నుండి అనుమతించరు. వారం రోజుల పాటు ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి.
* రైళ్లు, విమానాల ద్వారా ప్రయాణించేందుకు జర్నలిస్టులు, సీనియర్ సిటిజన్లు తదితరులకు జారీ చేసిన రాయతీలతో కూడిన ప్రయాణ అనుమతులను తాత్కాలింగా నిలిపివేయాలి. విద్యార్థులు, పేషంట్లు, దివ్యాంగులను మినహాయింపు ఇచ్చారు.
* ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులు తమ ఇళ్ల నుండే డ్యూటీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయాలని కేంద్రం సూచించింది. ఎమర్జెన్సీ, అత్యవసర సేవలకు ఈ నిబంధనలు వర్తించవు.
* గ్రూప్-బీ, గ్రూప్-సీ క్యాటగిరీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు భారీ మొత్తంలో గుమిగూడకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ వారాల్లో పనిచేసేలా చూడాలని ఆదేశించారు. ఉద్యోగులందరికీ వారు డ్యూటీకి హాజరుకావల్సిన తేదీలను ముందుగానే తెలియచేయాలి.