జాతీయ వార్తలు

నేడు బలపరీక్ష ఎదుర్కోవాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కరోనా వైరస్ పేరిట శాసన సభను వాయిదా వేసి పది రోజుల పాటు బలపరీక్ష నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండన్ సోమవారం సాయంత్రం షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. శాసన సభలో మంగళవారంలోగా బలపరీక్ష జరపకపోతే మెజారిటీ కోల్పోయినట్లు భావించాల్సి వస్తుందంటూ గవర్నర్ లాల్జీ టాండన్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు సోమవారం సాయంత్రం లేఖ రాశారు. లాల్జీ టాండన్ ముందు ఆదేశించిన ప్రకారం సోమవారం శాసన సభలో గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే బలపరీక్ష జరపాల్సి ఉంది. అయితే స్పీకర్ ప్రజాపతి లాల్జీ టాండన్ ప్రసంగం ముగిసిన తరువాత కరోనావైరస్ పేరుతో శాసన సభను మార్చి 26వ తేదీ వరకు వాయిదా వేశారు. బడ్జెట్ సంధర్భంగా తాను శాసన సభలో ప్రసంగించి బైటికి వచ్చిన తరువాత స్పీకర్ వ్యవహరించిన తీరు తెలియగానే లాల్జీ టాండన్ ఆగ్రహం చెందారు. కరోనావైరస్ పేరుతో తన ఆదేశాన్ని ధిక్కరించినందుకు మండిపడిన గవర్నర్ మంగళవారంలోగా బల పరీక్ష జరిపి మెజారిటీ నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను ఆదేశించారు. ఇది జరగని పక్షంలో మీరు మెజారిటీ కోల్పోయినట్లు భావించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటానని గవర్నర్ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో స్పష్టం చేశారు. శాసన సభలో బలపరీక్ష జరపాలంటూ తాను స్పీకర్ ప్రజాపతిని ఆదేశించడాన్ని మీరు ఎలా తప్పుపడతారని కమల్‌నాథ్‌ను గవర్నర్ ప్రశ్నించారు. కమల్‌నాథ్ ఇంత క్రితం గవర్నర్‌కు రాసిన లేఖలో బల పరీక్ష జరపాలని మీరు శాసన సభ స్పీకర్‌ను ఆదేశించటం అర్థరహితమని విమర్శించారు. గవర్నర్ లాల్జీ టాండన్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ గవర్నర్ ఆదేశాన్ని తప్పుపట్టే అధికారం ముఖ్యమంత్రికి ఉండదని స్పష్టం చేశారు.
*చిత్రం...గవర్నర్ టాండన్‌తో కలిసి సోమవారం బడ్జెట్ సమావేశాలకు అసెంబ్లీలోకి వస్తున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్