జాతీయ వార్తలు

2022 ఎన్నికల్లో 350 సీట్లు సాధిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మార్చి 15: ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభకు 2022లో జరిగే ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) 350 స్థానాల్లో విజయం సాధిస్తుందని అరచేతిని చూసి భవిష్యత్తును చెప్పే ఒక జ్యోతిష్యుడు (పామ్ రీడర్) ఇటీవల తనకు చెప్పాడని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఆదివారం నాడు వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 403 స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే కులాల వారీగా జనాభా గణన చేయిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం నాడిక్కడ పార్టీ కార్యాలయంలో అఖిలేశ్ యాదవ్ విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ‘విమానంలో ఢిల్లీకి వెళ్తుండగా, ఒక వ్యక్తి నా అరచేతులను చూశాడు. నేను గట్టిగా కష్టపడితే, 350 సీట్లు సాధించి వచ్చేసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పాడు’ అని అఖిలేశ్ యాదవ్ తెలిపారు. ‘350కన్నా ఒక్క సీటు ఎక్కువ సాధిస్తామని నేను అనుకుంటున్నాను.. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మేము కలిసి 351 సీట్లు సాధిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. అఖిలేశ్ యాదవ్ ఈ సందర్భంగా అధికార బీజేపీపై విరుచుకుపడ్డారు. కాషాయ పార్టీ అబద్ధాలు వ్యాప్తి చేసి రాష్ట్రంలో 300 సీట్లు సాధించగలుగగా, సమాజ్‌వాదీ పార్టీ నిజాయితీగా కష్టపడి పనిచేసి 351 సీట్లు సాధించగలుగుతుంది. మేము ఖచ్చితంగా దీనిని సాధిస్తాం’ అని అఖిలేశ్ యాదవ్ అన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ 48.7 శాతం ఓట్లతో 325 స్థానాలను గెలుచుకుంది. సమాజ్‌వాదీ పార్టీ 21.8 శాతం ఓట్లతో 47 స్థానాలను కైవసం చేసుకుంది. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) 22.2 శాతం ఓట్లతో 19 స్థానాలను దక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వం కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించకుంటే, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఎస్‌పీ ప్రభుత్వం ఉత్తర్‌ప్రదేశ్‌లో కులాల వారీగా జనాభా లెక్కలు సేకరిస్తుందని ఆయన తెలిపారు.
*చిత్రం... ఎస్‌పీ అధినేత అఖిలేశ్ యాదవ్