జాతీయ వార్తలు

నన్ను ఎప్పుడైనా కలవొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 11: ‘నేను కాంగ్రెస్ పార్టీలో సాధారణ నాయకుడిని మాత్రమే. నన్ను ఎవరైనా, ఎప్పుడైనా కలవచ్చు. ఇందులో అనుమానాలకు తావులేదు’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరడానికి ముందు జ్యోతిరాదిత్య సింధియా పలుమార్లు రాహుల్ గాంధీని కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన సమయాన్ని కేటాయించలేదని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. చాలాకాలంగా అపాయింట్‌మెంట్ దొరకకపోవడంతో సింధియా నిరాశకు గురయ్యారని, అందుకే పార్టీని వీడారని కూడా విమర్శలు ఉన్నాయి. ఈ వార్తలపై ఓ ఇంటర్వ్యూలో రాహుల్ స్పందిస్తూ తాను సాధారణ నేతను మాత్రమేనని, తన ఇంటికి సింధియా ఎప్పుడైనా రావచ్చునని వ్యాఖ్యానించారు. 18 ఏళ్లపాటు కాంగ్రెస్‌లో కొనసాగిన సింధియా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కోసం కమల్‌నాథ్‌తో తీవ్రంగా పోటీ పడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానం కమల్‌నాథ్ వైపే మొగ్గుచూపడంతో సింధియా రాజీ పడ్డారు. అయితే, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు ఆయనను కాంగ్రెస్ పార్టీకి దూరం చేశాయని రాజకీయ విశే్లషకులు చెబుతున్నారు. అధిష్టానం, ప్రత్యేకించి రాహుల్ గాంధీ తనకు సమయాన్ని కేటాయించలేదని, ఎన్నిసార్లు అపాయింట్‌మెంట్ కోరినా ఇవ్వలేదని సింధియా చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఫలితంగా రాహుల్ గాంధీ స్పందించాల్సి వచ్చింది. తన అపాయింట్‌మెంట్ కోసం ఎవరూ వేచి చూడాల్సిన అవసరం లేదని, ఎప్పుడైనా తన వద్దకు రావచ్చని అన్నారు. ఇది సింధియాకు కూడా వర్తిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, సింధియాకు అపాయింట్‌మెంట్ నిరాకరించినట్టు వచ్చిన ఆరోపణలపై ఆయన ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
*చిత్రం... పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు బుధవారం ఇతర ఎంపీలతో కలసి హాజరైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ