జాతీయ వార్తలు

విభజన హామీలు అమలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాష్ట్రానికి రూ.25,171 కోట్ల నిధులు విడుదల చేయాలి, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కోసం పన్ను రాయితీలు, పన్ను సెలవు ఇవ్వాలి, రాయలసీమ, ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్దికి కేబీకే లేదా బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్ రావు డిమాండ్ చేశారు. కేవీపీ ఈ మేరకు ప్రధాని
నరేంద్ర మోదీకి సోమవారం ఒక లేఖ రాశారు. ఆయన లేఖ ప్రతిని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా పంపించారు. కేంద్ర మంత్రివర్గం సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రయోజిత పథకాలకు 30 శాతం అదనపు నిధుల సహాయం చేస్తామని రాష్ట్రానికి హామీ ఇచ్చారు, ఈ హామీ మేరకు 2015-2020 కాలానికి గాను ఆంధ్ర ప్రదేశ్‌కు రూ.25,171 కోట్లు అందాల్సి ఉన్నదని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని కేవీపీ ప్రధాని మోదీకి రాసిన లేఖలో డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండేలా చూసుకునేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మున్ముందు మరింత దెబ్బ తినకుండా చూసేందుకే విభజన చట్టంలోని సెక్షన్ 46, సెక్షన్ 94ని ప్రత్యేకంగా రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచారని ఆయన వివరించారు. రాష్ట్రానికి ఐదు సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కల్పించాలన్నది కూడా ఈ లక్ష్యంతోనేనని ఆయన సూచించారు. ఆదాయం లోటును కూడా భర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ అనుమతితోనే ఈ హామీలు ఇచ్చిందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ హామీలను బేఖాతరు చేసిందని ఆయన ఆరోపించారు. 14వ ఆర్థిక సంఘం పేరుతో ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా దాట వేశారని కేవీపీ ఆరోపించారు. రాష్ట్రానికి ఆర్థిక సహాయం చేయడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందన్నారు. వనరుల లోటును భర్తీ చేసేందుకు రూ.13,776 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.3979 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నదని కేవీపీ విమర్శించారు. రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపిస్తోందనేందుకు ఇంత కంటే వేరే ఉదాహరణ అవసరమా? అని ఆయన ప్రశ్మించారు. విభజన చట్టాన్ని అమలు చేయడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని తెర ముందుకు తెచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక ప్యాకేజీని కూడా సక్రమంగా అమలు చేయలేదు, అందుకే అది విఫలమైందని కేవీపీ తెలిపారు. కేంద్రం అమలు చేసే పథకాల సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వానికి రూ.25,171 కోట్లు రావాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేయకుండా జాప్యం చేస్తోందని కేవీపీ దుయ్యబట్టారు.
రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టేందుకు కృషి చేయాలని ఆయన ముఖ్యమంత్రి జగన్‌ను కోరారు.

*చిత్రం... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్ రావు