జాతీయ వార్తలు

నారీ శక్తి నిరుపమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ వివిధ రంగాల్లో ప్రతిభాపాటవాలు కనబరిచిన 15 మంది మహిళలకు ‘నారీ శక్తి’ పురస్కారాలు అందజేశారు. 2019 సంవత్సరంలో వ్యవసాయం, క్రీడలు, చేతివృత్తులు, వన్యప్రాణి సంరక్షణ, విద్య తదితర రంగాల్లో సాహసోపేతంగా ప్రతిభ కనబరిచిన మహిళలకు పురస్కారాలు అందజేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నారీ శక్తి అవార్డులను అందజేశారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని పడాల భూదేవి రాష్ట్రపతి చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారాన్ని అందుకున్నారు. చిన్నాయి ఆదివాసీ వికాస్ సొసైటీ ద్వారా గిరిజన మహిళలను పోడు భూముల వ్యవసాయానికి ప్రోత్సహిస్తూ మెహిందీ కోన్లను తయారు చేయడం కూడా నేర్పించి వారికి ఉపాధి చూపించారు. 11 ఏళ్ళ వయస్సులోనే తల్లిదండ్రులు ఆమెకు బలవంతంగా వివాహం చేయడం, ఆ తర్వాత భర్త, అత్తింటివారి వేధింపులను తట్టుకుని ధైర్యంగా నిలబడి, ముగ్గురు కూతుళ్ళతో జీవనం సాగిస్తూ సమాజ సేవలో నిలబడినందుకు ఆమెకు ఈ గౌరవం దక్కింది. క్రీడా రంగంలో ఎన్నో విజయాలు సాధించి ఎంతో మందికి స్పూర్తిదాయకంగా నిలిచిన 103 ఏళ్ళ మన్ కౌర్‌కు ‘నారీ శక్తి’ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కౌర్ 93 ఏళ్ళ వయస్సులో అథ్లెటిక్ రంగంలో ప్రవేశంచి ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపీయన్‌షిప్ పోటీల్లో పాల్గొని నాలుగు బంగారు పతకాలు సాధించారు. కాన్పూర్ జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జనలు చేయకుండా ఇంటింటికీ వెళ్ళి ప్రజలను చైతన్యవంత పరుస్తూ నాలుగు వేల మరుగుదొడ్ల నిర్మాణానికి కారకురాలైన 58 ఏళ్ళ కళావతి దేవికీ రాష్టప్రతి కోవింద్ అవార్డును అందజేశారు. పేరేన్నికగన్న, వాణిజ్య పంట అయిన పుట్టగొడుగులను పండించడమే కాకుండా అనేక మందికి పంట దిగుబడికి అవలంభించాల్సిన విధానాలపై శిక్షణ ఇచ్చిన 43 ఏళ్ళ బీనా దేవికి రాష్టప్రతి పురస్కారాన్ని అందించారు. దౌరీ పంచాయతీకి సర్పంచ్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించిన దేవి రసాయన ఎరువులు కాకుండా సేంద్రీయ ఎరువులనే ఉపయోగించేలా ముంగార్ జిల్లాలోని చుట్టుపక్కల గల 105 గ్రామాల్లో 1500 మంది మహిళలను చైతన్యవంతం చేశారు. అంతేకాకుండా డిజిటల్ అక్షరాస్యతలో భాగంగా 700 మంది మహిళలకు మొబైల్ ఫోన్ల వినియోగంపైనా శిక్షణనిచ్చారు. కాశ్మీర్‌కు చెందిన 33 ఏళ్ళ అరిఫా జైన్ అంతరించిపోతున్న నుంబుదా హస్తకళలను పునరుద్ధరించి వంద మందికి పైగా మహిళలకు శిక్షణనివ్వడమే కాకుండా కాశ్మీర్ కళల్లో 25 మంది మహిళలకు ఉపాధి చూపించారు. అంతేకాకుండా దినసరి వేతనాన్ని రూ.175 నుంచి రూ.450కి పెంచారు. ఆమెకు రాష్టప్రతి కోవింద్ నారీ శక్తి పురస్కారాన్ని అందజేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసిన 47 ఏళ్ళ చామి ముర్ముకు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. లేడీ టార్జన్‌గా పేరొందిన జార్కండ్‌కు చెందిన ముర్ము మూడు వేల మందికి పైగా మహిళలతో 25 లక్షల మొక్కలను నాటించి శభాష్ అనిపించుకున్నారు.
ఇంకా తొలి ఇండియన్ మహిళా పైలట్ ఫైటర్లు మోహన్ జితర్వాల్, అవనీ చతుర్వేదీ, భావన కాంత్‌కు పురస్కారాలు అందజేశారు. ఇంకా వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నిల్జ వాంగ్మో, నుంగ్షి మాలిక్ తదితరులకు రాష్టప్రతి కోవింద్ పురస్కారాలు అందజేశారు.
*చిత్రాలు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆదివారం ఢిల్లీలో నారీ శక్తి అవార్డులను ప్రదానం చేస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. వీరిలో భారత వైమానిక దళ యుద్ధ పైలట్లు అవానీ చతుర్వేది, భావనా కాంత్, మోహనా సింగ్, వృద్ద మహిళలు, భిన్న రంగాలకు చెందిన స్ఫూర్తి ప్రదాతలూ ఉన్నారు.