జాతీయ వార్తలు

ఆమే మనకు స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 8: జల సంరక్షణ నుంచి దివ్యాంగుల హక్కుల రక్షణ వరకూ ఆ ఏడుగురి కృషి అద్వితీయం.. ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మీడియా ఖాతాలను అందిపుచ్చుకొన్న ఈ ఏడుగురికి ఏడుగురు వారు ఎంచుకొన్న రంగాల్లో వారికి వారే సాటి. భిన్న రంగాల్లో ఎదురైన సమస్యలను అధిగమిస్తూ వీరంతా కూడా నిరుపమాన విజయాలు నమోదు చేసుకొన్నవారే.. వీరి విజయాలను ప్రధాని మోదీ ట్విటర్, ఇన్‌స్టాగ్రాం పేజీల్లో అలాగే, ఫేస్ బుక్ పేజీల్లో జనానికి అందించారు. ‘‘ఆమే మనకు స్ఫూర్తి ‘షీ ఇన్‌స్పైర్స్ అజ్’పేరుతో వెలుగుచూసిన వీరి విజయాలు స్ఫూర్తిదాయకమైనవే’’.. వీరిలో స్నేహా మోహన్‌దాస్ అనే ఓ యువతి తల్లి ద్వారానే స్ఫూర్తిని పొంది ఫుడ్ బ్యాంక్ ఇండియాను ప్రారంభించింది. విదేశాల్లో ఉన్న వారితోనూ ఫుడ్ బ్యాంక్ ఇండియాను నడిపిన స్నేహ ఆకలి మంటలను తొలగించేందుకు కృషిచేసింది. ‘మా పనిలో భాగంగా అనేకమందితో మాట్లాడుతాం.. మొత్తం 20 చాప్టర్లు తెచ్చాం.. కమ్యూనిటీ కుకింగ్, కుకింగ్ మారథాన్‌లు, తల్లిపాలు ఇవ్వడం వంటి అంశాలపై అవగాహన కలిగించాం’ అని స్నేహ మోదీ ట్విటర్ ఖాతాలో పేర్కొంది. అలాగే, మాళవిక అయ్యర్ అనే మరో యువతి 13ఏళ్ల వయస్సులోనే భయానకమైన బాంబు విస్ఫోటనానికి మాళవిక గురైంది. దీంతో ఆమె శరీర అవయవాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ‘నిరాశతో జీవించాలని నేను భావించలేదు.. పరిమితులను పక్కనపెట్టి విశ్వాసం, నమ్మకంతో ప్రపంచానికి ఎదురెళ్లండి.. అప్పుడు విజయం మీదే’ అని ఆమె మోదీ సామాజిక ఖాతాలో రాసారు. కాశ్మీర్‌కు చెందిన అరిఫాద్ జాన్ అనే మహిళ కాశ్మీర్ సంప్రదాయక కళల వ్యాప్తికి కృషిచేశారు. ఆ విధంగా మహిళల సాధికారికతకు తోడ్పడ్డారు. సంప్రదాయంతో ఆధునికతను మేళవించి కాశ్మీరీ మహిళల జీవితాల్లో వెలుగు తెచ్చానని ఆమె తెలిపారు. జల సంరక్షణే ఉద్యమంగా కృషి చేసిన కల్పనా రమేష్ విజయం కూడా ఎందరికో స్ఫూర్తిదాయకం.. ‘నీటిని బాధ్యతగా వాడండి.. జలాన్ని సంరక్షించండి.. జనంలో అవగాహన పెంచండి’ అని ఆమె రాశారు. గ్రామీణ మహారాష్టక్రు చెందిన బంజారా ప్రజల చేతివృత్తులకు గుర్తింపు తెచ్చేందుకు విజయపవార్ కృషిచేశారు. గత రెండు దశాబ్దాలుగా తాను వేలాది మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చానని ఆమె రాశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కళావతి దేవి కృషి కూడా అందరికీ ప్రోత్సాహకరమే. టాయ్‌లెట్‌లు కట్టేందుకు ఆమె నిధులు సేకరించారు. ఎవరేమనుకొన్నా ముందుకు సాగితేనే విజయం సిద్ధిస్తుందని ఆమె సాధించిన విజయాల రహస్యం స్వచ్ఛతతోనే మార్పు తీసుకురావచ్చని తాను భావించాననీ.. అందుకే ప్రజల నుంచి నిధులు సేకరించి మరుగుదొడ్లు నిర్మిస్తున్నానని తెలిపారు. మనసుంటే మార్గం ఉంటుందన్న అక్షర సత్యాన్ని బిహార్‌లోని ముందేల్‌కు చెందిన వీణాదేవి విజయాలకు నిదర్శనం. ఆమె తన మంచం కింద పుట్టగొడుగులను పెంచారు. ఆ విధంగా స్వావలంబనను సాధించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నానని తెలిపారు.