జాతీయ వార్తలు

మోదీజీ.. మహిళా బిల్లుకు మోక్షమెప్పుడో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజైన ఆదివారం కేంద్ర ప్రభుత్వంపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నిప్పులు చెరిగారు. ఆరేళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టలేదని ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘నా సామాజిక మాధ్యమాల ఖాతాలన్నీ స్ఫూర్తిదాయక మహిళలకు అప్పగిస్తున్నా’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలను ఉటంకిస్తూ సీతారాం ఏచూరి ఈ విధంగా ధ్వజమెత్తారు. ‘అంతర్జాతీయ దినోత్సవం అన్నది ఒక్కరోజుకే పరిమితమైనది కాదు.. విప్లవాత్మక సందేశమైన సమాన పని.. సమాన వేతనం అన్న నినాదం ఎప్పటినుంచో ఆకాశంలో సగంగా భావించే మహిళల నుంచి వస్తోందని’ సందర్భంగా ఏచూరి చేసిన ట్వీట్‌లో ప్రస్తావించారు. సమానత్వంపై ఇచ్చే హామీల అమలు కోసం నిత్యం పోరాటం జరపాల్సిన అవసరం చాలా ఉందని ఈ సందర్భంగా ఏచూరి పేర్కొన్నారు. ‘దశాబ్ద కాలం నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభ స్పీకర్ రూంలోనే పడి ఉంది.. మహిళా సమస్యలపై మాట్లాడే ముందు నరేంద్ర మోదీ ఎందుకు ఆరేళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకురాలేదు’ అని ప్రశ్నించారు. ‘స్ఫూర్తిదాయకమైన మహిళల జీవితం, పనితనానికి గుర్తింపుగా నా సోషల్ మీడియా ఖాతాలను వారికి ఇచ్చేస్తున్నా.. ఇది కోట్లాది మంది మహిళల్లో స్ఫూర్తిదాయకం కావాలని’ అయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
*చిత్రం... సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి