జాతీయ వార్తలు

వారంలో 3 గంటలే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 8: గత నెలలో జరిగిన ఢిల్లీ అల్లర్లపై ప్రతిపక్షాలు చర్చకు పట్టు పట్టిన నేపథ్యంలో గత వారం జరిగిన రాజ్యసభ బడ్జెట్ సమావేశాలు కేవలం మూడు గంటలు కూడా జరక్కపోవడం గమనార్హం. ఈశాన్య ఢిల్లీలో జరిగిన మత ఘర్షణలపై చర్చకు డిమాండ్ చేసిన నేపథ్యంలో 28.30 గంటల పాటు జరగాల్సి ఉండగా 26 గంటల పాటు ఎలాంటి చర్చా లేకుండానే రాజ్యసభ సమావేశాలు ముగియడం శోచనీయం. వివిధ శాఖలకు సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన నిధులపై సమావేశాల్లో చర్చ జరగాల్సి ఉంది. అయితే, గత వారం జరిగిన సమావేశాల్లో ప్రతిపక్షాలు ఢిల్లీ అల్లర్లపై పట్టుపట్టడంతో కేవలం రెండు గంటల 42 గంటలు మాత్రమే బడ్జెట్‌పై చర్చ జరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. గత వారం మొత్తమీద 25 గంటల 48 నిమిషాల విలువైన సమయం విపక్షాల వాయిదా తీర్మానం.. మత ఘర్షణలపై చర్చకు డిమాండ్‌ల కారణంగా వృథా అయిపోయింది. ఇదిలా ఉంటే.. పార్లమెంట్ స్థారుూ సంఘ సమావేశాలకు 50 శాతం మంది ఎంపీలు హాజరు కాకపోవడం విశేషం. అధికార వర్గాల కథనం ప్రకారం 57 శాతం టీఎంసీ ఎంపీలు, 36 శాతం బీజేపీ ఎంపీలు, 15 శాతం కాంగ్రెస్ ఎంపీలు, మిగిలిన ఇతర పార్టీలకు చెందిన 50 శాతం ఎంపీలు సమావేశాలకు డుమ్మాకొట్టిన అధికార వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది.