జాతీయ వార్తలు

మరో మూడు కరోనా వైరస్ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలో మరో మూడు కరోనా వైరస్ కేసులు నిర్ధారితమయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారంనాడు ప్రకటించింది. వీటితో మొత్తం దేశంలో ఈ కేసులు 34కు పెరిగాయని వెల్లడించింది.
తాజాగా వెల్లడైన మూడు కేసుల్లో ఇద్దరు లడఖ్‌కు చెందినవారని, వీరిద్దరూ ఇటీవల ఇరాన్‌కు వెళ్లి వచ్చారని తెలిపింది. అలాగే తమిళనాడుకు చెందిన మూడో వ్యక్తి ఇటీవల ఒమన్‌ను సందర్శించినట్టు వివరించింది. అయితే ఈ రోగుల ఆరోగ్య పరిస్థితి సురక్షితంగా ఉందని తెలిపింది. మరో 150 మందిని ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచినట్టు తెలిపింది. మరోపక్క ఇరాన్‌లో ఉంటున్న 108 మంది భారతీయుల నమూనాలను శనివారం ఉదయం పరీక్షల నిమిత్తం ఇక్కడకు తీసుకువచ్చారు.
ఈ నమూనాలను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో పరీక్షిస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐసీఎంఆర్‌కు చెందిన ఆరుగురు శాస్తవ్రేత్తలను ఇరాన్‌లోనే ఉంచామని, అక్కడ లేబొరేటరీలో పరీక్షలు జరిపేందుకు 10 కోట్ల విలువైన పరికరాలను కూడా పంపినట్టు తెలిపింది. దేశంలోని అనేక విమానాశ్రయాల్లో 7వేలకు పైగా విమానాల్లో వచ్చిన 7 లక్షలకు పైగా ప్రయాణికులను ముందు జాగ్రత్త చర్యగా పరీక్షించినట్టు వెల్లడించింది. ఒక్క శుక్ర, శనివారాల్లోనే 73 వేల మంది ప్రయాణికులకు పరీక్ష జరిపినట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల పరిశీలనకు 52 లేబొరేటరీలను ఏర్పాటు చేశామని, అలాగే అదనంగా మరో 57 పరిశోధనా కేంద్రాలను కూడా అందుబాటులోకి తెచ్చామని తెలిపింది. కాగా, ఈ వైరస్ గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ప్రత్యేక కోవిడ్-19 మొబైల్ ఫోన్ కాలర్ ట్యూన్‌ను అన్ని టెలికాం సంస్థలు అందుబాటులోకి తెచ్చాయి. వీటి ద్వారా ప్రజలకు వైరస్‌ను నివారించేందుకు అవసరమైన సూచనలు అందిస్తారు.
*చిత్రం... జోర్‌హట్‌లోని ఓ ప్రాంతంలో వైద్య సిబ్బంది ప్రయాణికులను పరీక్షించేందుకు ఇలా ఓ థర్మల్ స్క్రీనింగ్
పరికరాన్ని ఏర్పాటు చేశారు.