జాతీయ వార్తలు

నమస్తే చెబుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనావైరస్ సోకకుండా చూసుకునేందుకు షేక్ హ్యాండ్(కరచాలనం)కు బదులు చేతులు జోడించి నమస్కారం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు. నరేంద్ర మోదీ శనివారం జన ఔషధి దినోత్సవం సందర్భంగా జన ఔషధి లబ్దిదారులు, కేంద్రాల యజమానులతోవీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్‌కు సంబంధించిన వదంతులను ఎంత మాత్రం విశ్వసించకూడదని ఆయన దేశ ప్రజలకు హితవు చెప్పారు. వందతులను నమ్మి భయపడే బదులు వైద్యులు ఇచ్చే సలహాలను నూటికి నూరు శాతం పాటించాలని మోదీ హితవుపలికారు. ఇతరులను పలకరించవలసి వస్తే కరచాలనం చేసే బదులు రెండు చేతులూ జోడించి నమస్కారం చేయాలని ప్రధాని అన్నారు. ‘ప్రపంచం మొత్తం మన సంప్రదాయ నమస్తేను అలవాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. నమస్తేను అలవాటు చేసుకునేందుకు ఇప్పుడు మరో అవకాశం లభిస్తోంది. కరోనా నుంచి దూరంగా ఉండేందుకు సంప్రదాయ బద్దంగా నమస్తే చెప్పాలి’అని ఆయన అన్నారు. కాగా ప్రతి భారతీయుడి ఆరోగ్య పరిరక్షణ కోసం తమ ప్రభుత్వం నాలుగు లక్ష్యాలను నిర్దేషించుకుని వాటిని సాధించేందుకు కృషి చేస్తోందని ప్రధాన మంత్రి ప్రకటించారు. పౌరులను అనారోగ్యాల బారి నుంచి దూరం ఉంచటం మొదటి లక్ష్యం. అనారోగ్యానికి గురయ్యే వారికి మంచి, సులభతర వైద్యం అందుబాటులో ఉండటం రెండోది. ఆధునిక ఆసుపత్రులను అందుబాటులో ఉంచడం, అవసరమున్నంత మంది సమర్థులైన వైద్యులు, ఇతర సిబ్బందిని ఏర్పాటు చేయటం మూడోలక్ష్యం. మిషన్ మోడ్‌లో పని చేయటం ద్వారా సవాళ్లను ఎదుర్కొనటం నాలుగో లక్ష్యం అని మోదీ ప్రకటించారు. దేశంలోని ప్రతి పౌరుడికి నాణ్యమైన, సరసమైన ధరలకు వైద్య చికిత్సను అందజేయటం జన ఔషది పథకం ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. దేశం మొత్తం మీద ఇంత వరకు ఆరు వేల జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేసినందుకు తనకు సంతోషంగా ఉన్నదని ఆయన పేర్కొన్నారు. జన ఔషధి కేంద్రాల నెట్ వర్క్ పెరిగే కొద్ది దీని ఫలితాలు మరింత మంది ప్రజలకు చేరుకుతున్నాయన్నారు. ఇప్పుడు ప్రతి నెల దాదాపుకోటి కుటుంబాల వారు జన ఔషధి కేంద్రాల ద్వారా సరసమైన ధరలకు నాణ్యమైన ఔషధాలను కొనుగోలు చేస్తున్నారని ప్రధాన మంత్రి తెలిపారు. జన ఔషధి కేంద్రాల్లో మందుల ధరలు ఇతర దుకాణాలతో పోలిస్తే యాభై నుండి తొంభై శాతం వరకు తక్కువగా ఉన్నాయని మోదీ చెప్పారు. కేన్సర్ రోగానికి ఉపయోగించే ఒక మందు మార్కెట్‌లో ఆరు వేల ఐదు వందల రూపాయలకు లభిస్తే జన ఔషధి కేంద్రాల్లో ఇదే మందు కేవలం ఎనిమిది వందల రూపాయలకు లభిస్తోందని మోదీ తెలిపారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం మూలంగా చికిత్స ఖర్చులు బాగా తగ్గుతున్నాయంటూ జన ఔషధి కేంద్రాల వల్ల పేద, మధ్య తరగతి ప్రజలకు ఒక అంచనా ప్రకారం ఇంత వరకు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల పొదుపుజరిగిందని ప్రధాని వెల్లడించారు. జన ఔషధి కేంద్రాల విజయానికి కృషి చేస్తున్న వారికి త్వరలోనే అవార్డులు ప్రకటించటం ద్వారా వారిని ప్రోత్సహిస్తామన్నారు. ఆయుష్మాన్ భారత పథకం ద్వారా దాదాపు 90 లక్షల మంది బీద ప్రజలు లబ్ది పొందారు, దాదాపు ఆరు లక్షల మందికి ఉచితంగా డయాలసిస్ జరిగిందని ప్రధాని తెలిపారు. అత్యవసర మందుల ధరలను నియంత్రించటం వలన 12, 500 కోట్ల రూపాయలు పొదుపుజరిగిందని చెప్పారు. మందుల ధరలు తగ్గటం వలన లక్షలాది మందికి నూతన జీవితం లభించిందని ఆయన వెల్లడించారు.
*చిత్రం... జన ఔషధి దినోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ