జాతీయ వార్తలు

సవాళ్లను ఎదుర్కొందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 7: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ భారత్‌లోకి విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్టు కేంద్రం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచానికే పెను సవాల్‌గా మారిందని శనివారం ఇక్కడ పేర్కొన్నారు. నేషనల్ డిఫెన్స్ కాలేజీ(ఎన్‌డీసీ) 58వ ఎంఫిల్ స్నాతకోత్సవంలో రక్షణ మంత్రి దేశ అభివృద్ధి, భవిష్యత్‌ను తీర్చిదిద్దడంతో సైనిక, సివిల్ సర్వీసు అధికారుల కీలక భూమిక పోషిస్తారని అన్నారు. భవిష్యత్‌లో సమస్యలను ధీటుగా ఎదుర్కొనేందుకు సంస్థ సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆసియా దేశాలు, అలాగే ప్రపంచంలోనే వృద్ధి, ఆర్థికాభివృద్ధి, స్వయం సమృద్ధి, శాంతి, సుస్థిరతలో భారత్ శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించిందని రక్షణ మంత్రి చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత సైన్యం ఆధునీకరిస్తున్నట్టు, ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఈనేపథ్యంలో జాతీయ భద్రతకు కేంద్రం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని అన్నారు. భవిష్యత్ రక్షణ అవసరాలకు అనుగుణంగా దేశీయంగానే ఆయుధాల ఉత్పత్తిపై దృష్టి కేంద్రీకరించినట్టు రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఎన్‌డీసీలో ఎంఫిల్ పూర్తిచేసుకున్న వారికి రక్షణ మంత్రి అభినందనలు తెలిపారు. ‘ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ ఉగ్రవాదం, చాందసవాదం, జాతుల సమస్య, ఆర్థిక అసమానతలు, వ్యవస్థీకృత నేరాలు ఈ కోవలోకి వస్తాయి. అలాగే ప్రాంతీయ రాజకీయాలు, ప్రాంతీయ వ్యూహాత్మక సమీకరణలుజాతీయ భద్రతపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల చైనాలో బయటపడిన కరోనా వైరస్ ప్రపంచానే్న కుదిపేస్తోందని రక్షణ మంత్రి అన్నారు. భవిష్యత్ సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రక్షణ, వ్యూహాత్మక అధ్యయనాల్లో ఏడాది ఎంఫిల్ డిగ్రీని మద్రాస్ యూనివర్సిటీ అందజేస్తోంది. అరవై మంది గ్రాడ్యుయేట్లకు రక్షణ మంత్రి పట్టాలు ప్రదానం చేశారు. బంగ్లాదేశ్, నైజీరియా, శ్రీలంక, ఉగాండా సైనిక అధికారులూ ఇక్కడ ఎంఫిల్ చేశారు. ఎన్‌డీసీ కమాండెంట్ ఎయిర్ మార్షల్ డీ చౌదరి పాల్గొన్నారు.

*చిత్రం... కేంద్రం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్