జాతీయ వార్తలు

మున్సిపాలిటీకి పోటీ చేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 7: ‘కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేవీఎం)కు త్వరలో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా? అయితే మీ పూర్తి వివరాల బయోడాటాను ఈ బాక్సులో వేయండి’ అని రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఆశావాహులకు పిలుపునిచ్చింది. ఎన్నికల్లో పోటీ చేయడానికి కొంత మంది ముందుకు వస్తున్నప్పటికీ, మరి కొంత మంది నాయకత్వాన్ని కలుసుకుని తమ అర్హతల గురించి చెప్పుకోలేకపోతున్నారన్న భావనతో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. ఎవరిని కలుసుకోవాలో, ఎవరికి తమ సత్తా, అర్హతల గురించి చెప్పుకోలేక వెనుకబడి పోతున్నారని ఆయన చెప్పారు. అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని బీజేపీ జాతీయ కార్యదర్శి రాహుల్‌సిన్హా శనివారం పీటీఐ వార్తా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ తెలిపారు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి జాబితా రూపొందిస్తామన్నారు. అన్ని విధాల అర్హులైన వారికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు. ఐదు రోజుల క్రితం డ్రాప్ బాక్సును ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వివరించారు. పార్టీ కార్యకర్తలే కాకుండా ఎవరు పోటీ చేయాలనుకుంటున్నా తమ బయోడేటాతో కూడిన దరఖాస్తును ఈ బాక్స్‌లో వేయాల్సిందే.
*చిత్రం... కోల్‌కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ ఇదే