జాతీయ వార్తలు

ఏబీకి షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కేంద్రం షాక్ ఇచ్చింది. ఏబీని సస్పెండ్ చేయటం సమర్థనీయమేనని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. వెంకటేశ్వరరావు అవినీతిపై ఏప్రిల్ 7 తేదీలోగా చార్జిషీట్ దాఖలు చేయాలని కేంద్ర హోం శాఖ శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏబీ వెంకటేశ్వరరావుపై అవినీతికి సంబంధించిన ప్రాథమిక ఆదారాలు ఉన్నాయని కేంద్ర హోం శాఖ అభిప్రాయపడింది. అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఆయనను సస్పెండ్ చేశారని, ఏపీ ప్రభుత్వ చర్య సమర్థనీయమని హోం శాఖ ప్రకటించింది. ఇరవై ఐదు కోట్ల పరికరాల కొనుగోలులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనీ, ఈ అక్రమాల వెనక చంద్రబాబు హయాంలో ఇంటిలిజెన్స్ ఐజీగా పనిచేసిన వెంకటేశ్వరరావుహస్తం ఉన్నదని హోం శాఖ తమ ఆదేశంలో పేర్కొంది. వెంకటేశ్వరరావు పోలీసు శాఖ అధునీకీకరణం పేరుతో అవినీతికి పాల్పడ్డారని కేంద్ర హోం శాఖ నిర్ధారించినట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెల 8న ఏబీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయటం తెలిసిందే. వెంకటేశ్వరరావు ప్రవర్తనా నియమావళిని ఉల్లంగించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తమ సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొంది.

*చిత్రం...ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు