జాతీయ వార్తలు

అమిత్ షా రాజీనామా కోరండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అల్లర్లను అదుపుచేయడంలో ఘోరంగా విఫలమైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసాత్మక సంఘటన్లో 34 మంది మృతి చెందారు. 200 మంది గాయపడ్డారు. హోం మంత్రిగా అమిత్ షా విఫలమయ్యారంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో పార్టీ సీనియర్ నేతల బృందం గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసింది. అమిత్ షా రాజీనామా కోరాలని రాష్టప్రతికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్‌లో కోవింద్‌ను కలిసి వినతిపత్రం అందించారు. అల్లర్లకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కారణమని సోనియాగాంధీ ఆరోపించారు. హింస పేట్రేగిపోతున్నా అదుపుచేయడంలో రెండు ప్రభుత్వాలూ విఫలమయ్యాయని ఆమె ధ్వజమెత్తారు. ‘్ఢల్లీ పౌరుల ప్రాణాలకు భద్రత, స్వేచ్ఛ ఇవ్వడంలో అలక్ష్యం ప్రదర్శించారు. తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఇంత జరిగినా రాజ్యాంగ పదవిని అంటిబెట్టుకుని ఉండడం సరైందికాదు. మీరు తక్షణం జోక్యం చేసుకుని హోం మంత్రి అమిత్ షా నుంచి రాజీనామా కోరండి’అని రాష్ట్రపతికి అందించిన వినతి పత్రంలో కోరారు. ‘మీరు తీసుకునే నిర్ణయం ఆప్తులను కోల్పోయిన కుటుంబ సభ్యులకు, ఆస్తులను పోగొట్టుకున్న వారికి స్వాంతన చేకూరుస్తుంది. రాష్టప్రతిగా నిర్మాణాత్మకమైన నిర్ణయం తీసుకోవాలి’అని కాంగ్రెస్ బృందం అభ్యర్థించింది. రాష్ట్రపతి భవన్‌లో కోవింద్‌ను కలిసిన తరువాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మీడియాతో మాట్లాడారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, పీ చిదంబరం, కేసీ వేణుగోపాల్, మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ వాద్రా, ఆంనద్ శర్మ, ఏకే ఆంటోనీ, కుమారి సెల్జా, రణ్‌దీప్ సుర్జేవాలా రాష్టప్రతిని కలిసిన వారిలో ఉన్నారు. ‘రాష్ట్రపతిజీ మీరు రాజ్యాంగం కల్పించిన అత్యున్న పదవిలో ఉన్నారు. మనస్సాక్షి ప్రకారం నిష్కర్షంగా వ్యవహరించండి. రాజ్య ధర్మాన్ని కాపాడాలి’అని కోవింద్‌కు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. ఈశాన్య రాష్ట్రం అల్లర్లతో అట్టుడికి పోతుంటే హోం మంత్రి అమిత్ షా ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం చిన్నగా మొదలైన గొడవలను సకాలంలో ఆపి ఉంటే ఇంత నష్టం వాటిల్లి ఉండేది కాదని సోనియా గాంధీ అన్నారు. ‘ కేంద్ర ప్రభుత్వమే కాదు.. ఢిల్లీ ముఖ్యమంత్రి, కొత్తగా గద్దెనెక్కిన రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ బాధ్యతలు సక్రమంగా నెరవేర్చలేదు. తమకు పట్టనట్టు వ్యవహరించినందుకే ఉపద్రం జరిగిపోయింది’అని కాంగ్రెస్ అధినేత్రి మండిపడ్డారు. ‘ఈ విషయంలో ఇంటిలిజెన్స్ విభాగం వైఫల్యం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉద్రిక్తతలకు సంబంధించి నిఘా వర్గాలు హోం మంత్రిత్వశాఖకు సకాలంలోనే చేరవేశాయా? ఒక వేళ చేరవేసినా శాఖ నిర్లిప్తత ప్రదర్శించిం దా?’అని ఆమె ప్రశ్నించింది. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం, అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఢిల్లీ సర్కార్ తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేదని సోనియా తీవ్రంగా విరుచుకుపడ్డారు. రెండు ప్రభుత్వాలు సకారంలో స్పందించి, చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదని రాష్ట్రపతి కోవింద్‌కు ఇచ్చిన వినతి పత్రంలో కాంగ్రెస్ పేర్కొంది. ఢిల్లీ పోలీసు శాఖపైనా సోనియా విమర్శలు గుప్పించారు. అల్లర్లను అదుపుచేయడానికి అదనపుబలగాలను ఎందుకు మోహరించలేదని హోం మంత్రి అమిత్ షాను ఆమె నిలదీశారు. దేశ రాజధాని ఢిల్లీలో గత నాలుగు రోజులుగా జరిగిన సంఘటనలు రాష్ట్రపతి కోవింద్‌కు వివరించినట్టు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వెల్లడించారు. ఢిల్లీ అల్లర్లు జాతికే మాయని మచ్చగా ఆయన అభివర్ణించారు. ‘34 మంది చనిపోయారు. 200 మంది గాయపడ్డారు. పరిస్థితిని అదుపుచేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిప్తోంది’అని ఆయన విమర్శించారు.‘రాజ్యాంగం కల్పించిన అధికారాన్ని వినియోగించి ప్రజలకు రక్షణ కల్పించే నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతిని మేం అభ్యర్థించాం’అని మన్మోహన్ సింగ్ మీడియాకు తెలిపారు.
*చిత్రం...ఢిల్లీ అల్లర్లపై రాష్ట్రపతి కోవింద్‌కు విజ్ఞాపన పత్రం అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా