జాతీయ వార్తలు

మైన్మార్ అధ్యక్షుడితో మోదీ చర్చలు సఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం నాడిక్కడ మైన్మార్ అధ్యక్షుడు యూ విన్ మియింట్‌తో విస్తృత అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మైన్మార్ సామాజిక-ఆర్థికాభివృద్ధిపై కేంద్రీకృతమయి ఉన్న పది ఒప్పందాలు ఇరు దేశాల మధ్య కుదిరాయి. బుధవారం నాడిక్కడికి చేరుకున్న మైన్మార్ అధ్యక్షుడికి ఇక్కడి రాష్ట్రపతి భవన్‌లో సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం లభించింది. మియింట్‌కు, మైన్మార్ ప్రథమ మహిళ డా చోచోకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి మోదీ స్వాగతం పలికారు. అనంతరం ఇక్కడి హైదరాబాద్ హౌస్‌లో మోదీ, మియింట్ వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పది ఒప్పందాలు కుదిరాయి. వీటిలో ఎక్కువ మట్టుకు ఒప్పందాలు భారత్ సహాయంలో మైన్మార్‌లో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించినవే. ప్రత్యేకంగా ఘర్షణలతో చితికిపోయిన రఖినే రాష్ట్రంలో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించినవి ఉన్నాయి. ‘మనుషుల అక్రమ రవాణా నిరోధానికి సహకారం, వారిని కాపాడటం, బయటకు తీసుకురావటం, స్వదేశానికి పంపించటం, బాధితులను తిరిగి వారి సంబంధీకుల దగ్గరికి చేర్చటం’పై ఒక అవగాహనా ఒప్పందం కూడా వీటిలో ఉన్నాయి. క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టుల (క్యూఐపీ) అమలుకు భారత్ ఆర్థిక సహాయానికి సంబంధించి కూడా ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. మైన్మార్‌లోని రఖినే రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఇరు దేశాల మధ్య మూడు ఒప్పందాలు కుదిరాయి. రఖినే రాష్ట్రంలో గతంలో పెద్ద ఎత్తున హింస జరిగింది. మత పరమయిన వివక్ష కారణంగా పెద్ద సంఖ్యలో రోహింగ్యాలు ఈ రాష్ట్రాన్ని వదలివెళ్లిపోయారు. మైన్మార్ అధ్యక్షుడు, అతని సతీమణి ఇక్కడి రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు.

*చిత్రం... మయన్మార్ అధ్యక్షుడి రాక సందర్భంగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన విందులో భాగంగా మయన్మార్ అధ్యక్షుడు యు విన్ మింట్ (ఎడమ నుంచి రెండో వ్యక్తి)తో కరచాలనం చేస్తున్న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. చిత్రంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మయన్మార్ ప్రథమ మహిళ డా చోచో లుక్ ఉన్నారు.