జాతీయ వార్తలు

జాతీయ సాంకేతిక జౌళి మిషన్ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: జాతీయ సాంకేతిక జౌళి మిషన్‌ను 1480 కోట్ల రూపాయల వ్యయం తో ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం, ఆర్థిక వ్యవహారాల ఉపసంఘం సమావేశంలో నిర్ణయించింది. సాంకేతిక జౌళి రంగంలో దేశాన్ని అంతర్జాతీయ నాయకుడిగా అభివృద్ధి చేయడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ సాంకేతిక జౌళి మిషన్‌ను 2020-21 నుంచి 2023-24 అంటే నాలుగు సంవత్సరాలు అమలు చేస్తారు. సాంకేతిక జౌళిని వ్యవసాయం, రోడ్లు, రైలు ట్రాక్‌లు, క్రీడా దుస్తులు, ఆరోగ్య రంగాలతో పాటు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, అగ్ని నిరోధక జాకెట్లు, అత్యున్నత ఎత్తుల్లో ధరించే యుద్ధ దుస్తుల తయారీ, అంతరిక్ష అవసరాలకు ఉపయోగిస్తారు. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో ఫైబర్ స్థాయిలో ప్రాథమిక పరిశోధన జరుపుతారు. సాంకేతిక జౌళికి సంబంధించిన యంత్రాల రూపకల్పన కూడా జరుగుతుంది.
జమ్ముకాశ్మీర్‌లో కేంద్ర చట్టాల అమలు
కేంద్ర పాలిత జమ్ముకాశ్మీర్‌లో కేంద్ర ప్రభు త్వం చట్టాల అనుసరణ, అమలుకు కేంద్ర మత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. జమ్ముకాశ్మీర్ కేంద్ర చట్టాలను అనుసరించేందుకు జమ్ముకాశ్మీర్ పునర్‌వ్యవస్థీకర చట్టం 2019లోని సెక్షన్ 96 ప్రకారం నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని అతర ప్రాంతాలకు వర్తించే అన్ని చట్టాలు ఇక మీదట జమ్ముకాశ్మీర్‌కు కూడా వర్తిస్తాయి. కేంద్ర మంత్రివర్గం ఈ రోజు తమ నిర్ణయంతో మొత్తం 37 కేంద్ర చట్టాలను జమ్ముకాశ్మీర్‌కు వర్తించేందుకు అనువైన మార్పులు, చేర్పులు చేసింది.
ఇండియా పోర్ట్స్ గ్లోబర్ లిమిటెడ్ (ఐజీపీఎల్)కు డీపీఈ మార్గదర్శక సూత్రాల నుండి మినహాయింపు ఇస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. రిజర్వేషన్లు, విజిలెన్స్ విధానాలు మినహా మిగతా అన్ని డీపీఈ మార్గదర్శక సూత్రాల నుంటి ఐజీపీఎల్‌కు మినహాయింపు లభించింది. ఇరాన్‌లోని శహీద్ బెహస్తీ ఓడరేవును అభివృద్ది చేసేందుకు ఐజిపిఎల్‌ను ఏర్పాటు చేయడం తెలిసిందే. ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షల ప్రభావం శహీద్ బెహస్తీ ఓడరేవుపై పడకుండా చూడటమే ఈ మినహాయింపుల లక్ష్యం.