జాతీయ వార్తలు

రాజ్యసభ సీటివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 26: త్వరలో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి తమకు ఓ సీటును కేటాయించాలని ఏఐఏడీఎంకేను విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకే బుధవారం డిమాండ్ చేసింది. సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూ ఈ స్థానాన్ని కేటాయించాలని విజయ్‌కాంత్ తరఫున ఆయన భార్య ప్రేమలత ఏఐఏడీఎంకేకు విజ్ఞప్తి చేయగా అధిష్ఠానంతో సమాలోచనలు జరిపి నిర్ణయం తీసుకొంటామని వివరణ ఇచ్చినట్లు సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కుదుర్చుకొన్న ఒప్పందం మేరకు డీఎండీకే రాజ్యసభ సీటు కేటాయించాలని సీఎం పళనిస్వామిని కోరారు. ఏప్రిల్ నెలలో తమిళనాడు నుంచి ఆరు నుంచి రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కుదుర్చుకొన్న ఒప్పందం మేరకు ఖాళీ అవుతున్న ఆరు రాజ్యసభ స్థానాల్లో ఒకటి తమకు కేటాయిస్తూ సంకీర్ణ ధర్మాన్ని పాటించాలని సీఎంకు విజ్ఞప్తి చేయగా.. అధిష్ఠానంతో చర్చించి నిర్ణయం తీసుకొంటామని చెప్పారని ప్రేమలత స్పష్టం చేశారు.