జాతీయ వార్తలు

ట్రంప్ వ్యాఖ్యలు అవమానకరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత్ పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య రంగంపై చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని కాంగ్రెస్ నేత, పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ వ్యాఖ్యానించారు. వాణిజ్య రంగంలో భారత్ తమతో వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని ట్రంప్ వ్యాఖ్యానించడాన్ని తివారీ తప్పుపట్టారు. దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం సరికాదని అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు పారదర్శంగాను, పటిష్టంగాను ఉండాలే తప్ప వ్యూహాత్మక విధానాలు కాదని తివారీ అన్నారు. భారత్‌పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజలందర్నీ అగౌరపరిచేవిధంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. భారత్‌పై ఒత్తిడి పెంచడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారని ఆయన ధ్వజమెత్తారు.