జాతీయ వార్తలు

మూసీ నదిని ప్రక్షాళన చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: తెలంగాణ గంగానదిగా పరిగణించే మూసీ నదిని సంరక్షించేందుకు అవసరమైన చర్యలను యుద్ధప్రాతిపదికన తీసుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వెంకయ్యనాయుడుకు ఆయన ఒక సుధీర్ఘమైన లేఖ రాశారు. మూసీ నదిని పరిశుభ్రం చేసేందుకు వీలుగా గంగానదిని పరిశుభ్రం చేసేందుకు చేపట్టినటువంటి నమామి గంగే లాంటి పథకాన్ని చేపట్టవలసిన అవసరం ఉన్నదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. నమామి గంగే లాంటి పథకాన్ని అమలు చేస్తేనే మూసీ నది పరిశుభ్రం అవుతుందని వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. కాలుష్యం మూలంగా మూసీ నది జీవం కోల్పోయిందని, కలుషిత నీటి ప్రవాహం ఇలాగే కొనసాగితే మూసీ పరిస్థితి మరింత దుర్భరమవుతుందని ఆయన హెచ్చరించారు. తన లోక్‌సభ నియోజకవర్గం నుండి ప్రవహించే మూసీ నది హైదరాబాద్ నుండి 70 కిలోమీటర్ల వరకు కాలుష్యాలతో నిండిపోయిందని, ఔషధాల కర్మాగారాలు తమ వ్యర్థపదార్థాలను నదిలోకి వదిలివేయడం వలన నది నీరు విషతుల్యంగా మారుతోందని వెంకటరెడ్డి తెలిపారు. ప్రస్తుతం
మొత్తం మూసీ నది కలుషితమైపోయిందని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలను తెలుసుకుని ఈ నదిని పరిశుభ్రం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉన్నదని ఆయన వెంకయ్యనాయుడు వివరించారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మురుగు, మురికినీరు, బురద నీరంతా మూసీ నదిలోకి ప్రవహిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనితోపాటు దాదాపు నలభై ఔషధ కర్మాగారాల వ్యర్థ పదార్థాలు మూసీ నదిలోకి వచ్చి పడుతున్నాయని వెంకటరెడ్డి ఉప రాష్ట్రపతికి వివరించారు. సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, మూసీని కలుషితం చేస్తున్న కర్మాగారాలపై చర్యలు తీసుకోవాలని, పెద్ద ఎత్తున చెట్ల పెంపకం చేపట్టాలని ఆయన సూచించారు. ఈ దిశగా చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన వెంకయ్యనాయుడుకు విజ్ఞప్తి చేశారు.
అనంతరం కేంద్ర యువజన, క్రీడలశాఖ మంత్రి కిరణ్ రిజుజుతో భేటీయైన వెంకట్‌రెడ్డి భువనగిరి నియోజకవర్గం కేంద్రంలో బహుళార్ధక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని కోరారు. భువనగిరి కొండ 700 ఫీట్ల ఎత్తులో ఉందని మలోవత్ పూర్ణ దీనిపై ట్రెక్కింగ్ సాధన చేసి ఎవరెస్టు అధిరోహించిందని, ఇక్కడ ఈ క్రీడా సాధనతో పాటు ఇతర క్రీడల అభివృద్ధికి వసతులు కల్పించాలని కోరారు. పార్లమెంట్ పరిధిలో చెరువులు, కుంటలు ఉన్నందునా జలక్రీడలను కూడా ప్రోత్సహించే చర్యలు చేపట్టాలని కోరారు.

*చిత్రం... ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భేటీ అయన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి