జాతీయ వార్తలు

సంతానం లేదన్న బెంగ వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నది. దేశంలోని కోట్లాది మంది మహిళల పునరుత్పత్తి హక్కులను పరిరక్షించడంతోపాటు సంతానలేమితో బాధపడుతున్న వారికి అత్యంత పటిష్టమైన పునరుత్పత్తి వ్యవస్థను ఏర్పాటు చేసే ‘పునరుత్పత్తి సాంకేతిక పరిజ్ఞానం నియంత్రణ బిల్లు (ది అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్లు-2020)’కు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అదేవిధంగా ప్రధాన మంత్రి పంటల బీమా పథకాన్ని పునర్‌వ్యవస్థీరించాలని నిర్ణయించారు. 22వ లా కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. శాస్త్ర పరిజ్ఞానం ఉపయోగంపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఒక ప్రత్యేక టెక్నాలజీ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్వచ్ఛ భారత్ మిషన్ రెండవ దశ కార్యక్రమాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. గుజరాత్‌లోని భాస్కరాచార్య స్పేస్ అప్లికేషన్ ఇనిస్టిట్యూట్‌ను జాతీయ స్థాయి ఇనిస్టిట్యూట్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. డైయిరీ రంగానికి ఇచ్చే వడ్డీ మినహాయింపును రెండు శాతం నుండి రెండున్నర శాతానికి పెంచాలని కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల ఉపసంఘం నిర్ణయించింది. దేశంలో పదివేల రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (్ఫర్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్)ను ఏర్పాటు చేయాలని ఆర్థిక వ్యవహారాల
ఉపసంఘంలో నిర్ణయించారు.
రీప్రొడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్లు
పుట్టబోయే పిల్లల లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారికి, మానన పిండాల విక్రయం, బీజకణాలు విక్రయం చేసే వారికి, ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్వహణ కోసం సంస్థలు, సంఘాలను ఏర్పాటు చేసే వారికి కఠిన శిక్షలు విధించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. సంతానలేమితో బాధపడేవారు ఇన్‌ఫెర్టిలిటీ కేంద్రాల సహాయంతో సంతానం పొందే సాంకేతిక పరిజానం, సేవల ప్రక్రియను ఈ బిల్లు నియంత్రించడంతోపాటు పునర్‌వ్యవస్థీకరిస్తుంది. మానవ సరోగసీ రెగ్యులేషన్ బిల్లు, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సవరణ బిల్లులను పార్లమెంటులో ప్రతిపాదించిన నేఫథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు రీప్రొడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్లును తెస్తోంది. మహిళల పునరుత్పత్తి హక్కులను రక్షించేందుకు ఈ బిల్లు ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వం ప్రకటించింది. పునరుత్పత్తి సాంకేతిక నియంత్రణ బిల్లును పార్లమెంటు ఆమోదించిన అనంతరం దీని నిర్వహణకు కేంద్ర స్థాయిలో ఒక బోర్డు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్థానిక బోర్డులను ఏర్పాటు చేస్తారు. మహిళల పునరుత్పిత్తి హక్కులను ఈ బిల్లు సంరక్షిస్తుంది. మాతృ జీవకణాలను దానం చేసే మహిళలకు బీమా చేయించడంతోపాటు బహుల పిండాలను అమరిక చేయడం నుండి మహిళలకు రక్షణ కల్పించేందుకు ఈ బిల్లులో ఏర్పాటు చేశారు. పునరుత్పత్తి ప్రక్రియ ద్వారా జన్మించే పిల్లలకు సహజ పద్ధతిలో పుట్టే పిల్లలతో సమాన హక్కులు కల్పిస్తారు. ఇంద్రియం, జీవకణాలు, పిండాలను నిల్వచేసే ఏఆర్‌టీ (ఆర్ట్ఫిషియల్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ) బ్యాంకుల నియంత్రణ కూడా ఈ బిల్లులో పొందుపరిచారు. పునరుత్పత్తి ప్రక్రియ ద్వారా పుట్టే పిల్లల ప్రయోజనాల పరిరక్షణ కోసం జన్యు కణాల అమరిక పరీక్షను తప్పనిసరి చేశారు. దేశంలోని నలు మూలల పునరుత్పత్తి కేంద్రాలు (ఫెర్టిలిటీ కేంద్రాలు) పుట్టుకొచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బిల్లు ఎంతో ప్రయోజనకారి అవుతుంది.
ప్రధాన మంత్రి పంటల బీమా పథకం
ప్రధాన మంత్రి పంటల బీమా పథకం, నియంత్రిత వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని పునర్ వ్యవస్థీకరించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇక మీదట ఈ రెండు బీమా పథకాలను ఆయా బీమా సంస్థలకు అప్పగించే కాలపరిమితిని మూడు సంవత్సరాలుగా నిర్ణయించింది. సేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను నిర్ణయించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వదిలివేస్తారు. కేంద్ర ప్రభుత్వం రాయితీని నీటిపారుదల ఉన్న భూములకు 25 శాతం, నీటిపారుదల లేని భూములకు 30 శాతానికి పరిమితం చేశారు. పంట నష్టాన్ని అంచనా వేసేందుకు రెండు అంచెల విధానాన్ని అమలు చేస్తారు. వీటితోపాటు మరిన్ని మార్పులు, చేర్పులు చేశారు. ఈ మార్పులు, చేర్పులు 2020 ఖరీఫ్ సీజన్ నుండి అమలులోకి వస్తాయి. గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ రెండో దశ కార్యక్రమానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిఒక్కరూ మరుగుదొడ్లను ఉపయోగించేలా చేయడంతో పాటు ఘన,ద్రవ,చెత్త నిర్వహణకు మరింత ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు ఓడీఎఫ్ ప్లస్ (ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ ప్లస్)పై దృష్టి కేంద్రీకరిస్తారు. 22వ లా కమిషన్ ఏర్పాటుకు కేంద్ర మత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఇది మూడు సంవత్సరాల పాటు పనిచేస్తుంది. లా కమిషన్ చట్టాలకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు కేంద్ర ప్రభుత్వం సూచించే అంశాలపై న్యాయపరమైన అధ్యయనం, పరిశోధన జరుపుతుంది. దీంతో ప్రస్తుతం అమలులో ఉన్న ఏ చట్టాలను రద్దు చేయడం, ఏ చట్టాలను సంస్కరించడం, సవరించడం చేయవచ్చుననేది కూడా లా కమిషన్ చూస్తుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పోల్చడం, సాంకేతిక పరిజ్ఞానం ఉత్పత్తులు, రెండు విధాలుగా ఉపయోగించుకునే సాంకేతిక పరిజ్ఞానంతో వాణిజ్యం చేయడం తదితర అంశాలపై సూచనలు, సలహాలు ఇచ్చేందుకు 12 మంది సభ్యులతోకూడిన టెక్నాలజీ గ్రూపును ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ముఖ్య శాస్త్ర, సాంకేతిక సలహాదారు ఈ గ్రూపునకు అధ్యక్షత వహిస్తారు.