జాతీయ వార్తలు

ఎన్నికల సంస్కరణలు అవశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: పేయిడ్ న్యూస్, తప్పుడు అఫిడవిట్లను ఎన్నికల నేరాలుగా పరిగణించడంతో పాటు ఎన్నికల సంస్కరణలను త్వరితగతిన తీసుకుని రావాల్సిన అవసరం ఎంతో ఉందని ఎన్నికల కమిషన్ మంగళవారం మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మంగళవారం శాసన కార్యదర్శి జి. నారాయణ రాజుతో జరిగిన సమావేశంలో అనేక అంశాలను ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆరోరా, కమిషనర్లు అశోక్ లావాస, సుశీల్ చందర్‌లు చర్చించారు. ఎన్నికల జాబితాను ఆధార్‌తో అనుసంధానం చేయడం సహా అనేక అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయని ఎన్నికల కమిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా ఎన్నికల సంస్కరణల అంశాన్ని కమిషన్ గట్టిగా ప్రస్తావించిందని, దీర్ఘకాలంగా దీనికి సంబంధించి 40కి పైగా ప్రతిపాదనలు న్యాయ మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న విషయాన్ని కూడా సీఈసీ ఆరోరా వెల్లడించినట్లు తెలిపింది. అఫిడవిట్‌లో తప్పుడు సమాచారాన్ని ఇస్తే సదరు అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించాలన్న అంశాన్ని కూడా ఈ సమావేశంలో ఈసీ ప్రస్తావించింది. అలాగే శాసనమండలి ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుకు సంబించి పరిమితి విధించాలని సూచించింది. ఇదిలాఉండగా ఎన్నికల కోడ్, ఎన్నికల జాబితా రూపకల్పన, ప్రచార ఖర్చు నియంత్రణ సహా అనేక అంశాలపై అధ్యయనం జరిపిన 9 బృందాలు మంగళవారం తమ నివేదికను ఎన్నికల కమిషన్‌కు అందించాయి. ఎన్నికల కమిషన్‌కు చెందిన 9 వర్కింగ్ గ్రూపులు అలాగే 20 మంది ప్రధాన ఎన్నికల అధికారులు తమ సుదీర్ఘ అధ్యయన నివేదికను రూపొందించారు. గత లోక్‌సభ ఎన్నికలు అలాగే ఇటీవల జరిగిన ఎన్నికలను కూలంకషంగా ఈ బృందం అధ్యయనం చేసింది. ఎన్నికల కమిషన్ 2 రోజుల సమావేశంలో తమ సిఫార్సులను నివేదించింది. ఈ వర్కింగ్ గ్రూపులు రూపొందించిన నివేదికను, అలాగే వాటి సిఫార్సులను లోతుగా పరిశీలిస్తామని, వీటిపై సంబంధిత పార్టీల అభిప్రాయాలను కూడా సేకరిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ ఆరోరా వెల్లడించారు. ఈ అధికారులను ఉద్దేశించి మాట్లాడిన ఆరోరా కేవలం అమలు యోగ్యమైన సిఫార్సులను మాత్రమే చేయాలని సూచించారు. ఈ గ్రూపులు తమ నివేదికలను సమర్పించే ముందు స్వల్పకాల, మధ్యకాల దీర్ఘకాల ప్రతిపాదికన కార్యాచరణ సూచనలు చేయాలని అన్నారు. అలాగే వీటి అమలుకు సంబంధించి చట్టాల పరంగా చేయాల్సిన సవరణలను కూడా సూచించాలని స్పష్టం చేశారు.

*చిత్రం... ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆరోరా