జాతీయ వార్తలు

ట్రంప్‌కు బహుమతిగా చరఖా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, ఫిబ్రవరి 18: భారత్‌లో త్వరలోనే పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అరుదైన బహుమతులు లభించనున్నాయి. అహ్మదాబాద్ పర్యటన సందర్భంగా ట్రంప్‌నకు మహాత్మా గాంధీ చరఖా, ఆయన జీవితానికి సంబంధించిన రెండు పుస్తకాలను, ఓ చిత్ర పటాన్ని సబర్మతీ ఆశ్రమంలో బహుకరించనున్నారు. సబర్మతి ఒడ్డున ఉన్న ఈ ఆశ్రమాన్ని ప్రధాని మోదీతో కలిసి ట్రంప్ సందర్శిస్తారు. ఈ నెల 24న ఆయన భారత్‌లో రెండు రోజుల పర్యటన మొదలవుతుంది. ఇప్పటి వరకు అనేక మంది అమెరికా అధ్యక్షులు భారత్‌లో పర్యటించినప్పటికీ, సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించనున్న తొలి అధ్యక్షునిగా ట్రంప్ తన ప్రత్యేకతను చాటుకోనున్నారు. గాంధీ ఆశ్రమంగా పేర్కొనే సబర్మతి ఆశ్రమం భారత స్వాతంత్రోద్యమం సమరానికి ప్రధాన కేంద్రంగా నిలిచింది. 1917 నుంచి 1930 వరకు ఉద్యమ కేంద్ర బింధువు ఈ ఆశ్రమమే. దాదాపు 30 నిమిషాల పాటు ట్రంప్ ఆయన భార్య మెలానియా, ప్రధాని మోదీ ఈ ఆశ్రమంలో గడుపుతారు. ఈ ఆశ్రమం లోపల ఉండే హృదయ్‌కుంజ్‌లో ఏర్పాటు చేసిన చరఖాను తిప్పేందుకు ట్రంప్, మెలానియాలు ప్రయత్నించే అవకాశం ఉందని ఆశ్రమ వర్గాలు తెలిపాయి.