జాతీయ వార్తలు

సామరస్యమే భారతీయత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఫిబ్రవరి 16: శాంతియు త సహజీవనం, భిన్నత్వంలో ఏక త్వం, బహుముఖీయ నైతిక వర్తనకు భారత్ పెట్టింది పేరు అని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. ఈ రకమైన ఔన్నత్యభరిత సంస్కృతిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని లింగపరమైన లేదా ఇతరత్రా ప్రజల మధ్య ఏ రకమైన వివక్షకూ ఆస్కారం ఉండకూడదన్నారు. రోటరీ అంతర్జాతీయ సంస్థ ఆదివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప రాష్టప్రతి ప్రసంగిస్తూ ఈ నీతిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. లింగం ఆధారంగా వివక్ష చూపకూడదన్నారు. భారత దేశం పొరుగు దేశాలతో, ఇతర దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలన్న భావనతో ఉందని ఆయన తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసమూ భారత దేశం కృషి చేస్తున్నదన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఏ శక్తినైనా ఎదుర్కొవడానికి ప్రతిన బూనాలని ఆయన ప్రపంచ దేశాలకు సూచించారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలన్నదే భారత్ యొక్క లక్ష్యమన్నారు. అందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పించేలా అందరమూ కృషి చేద్ధామని ఆయన సూచించారు. స్నేహితులను మార్చుకోవచ్చు, కానీ మీ పొరుగు దేశాన్ని మార్చుకోలేరు కదా! అని ఆయన పేరు ప్రస్తావించకుండా పొరుగు దేశాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
భారత్ ఎల్లప్పుడూ వసుదైవ కుటుంబాన్ని విశ్వసిస్తుందన్నారు. అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబంగా భావిస్తుందని ఆయన వివరించారు. భారత్ స్థిరమైన అభివృద్ధి అజెండాతో పని చేస్తున్నదని ఆయన తెలిపారు. చట్టాలు చేసే వారు ఆ దిశగా ఆలోచన చేయాలని ఆయన సూచించారు. అనవసరమైన రాద్ధాంతాలతో సమయం వృధా చేసుకోరాదన్నారు. యువత తమ మాతృ భాషను మరిచిపోరాదని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు.
*చిత్రం...కార్యక్రమంలో మాట్లాడుతున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు