జాతీయ వార్తలు

ఆ వీడియోను మేము విడుదల చేయలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్న తాజా వీడియోను తాను విడుదల చేయలేదని జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) విశ్వవిద్యాలయం ఆదివారం స్పష్టం చేసింది. గత సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన పారా మిలిటరి, పోలీసు దుస్తులు ధరించిన కొంతమంది విశ్వవిద్యాలయ గ్రంథాలయంలోకి ప్రవేశించి, విద్యార్థులను క్రూరంగా కొడుతున్న దృశ్యాలు ఈ తాజా వీడియోలో ఉన్నాయి. 48 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఉన్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలోనివిగా కనపడుతున్నాయి. ఏడెనిమిది మంది పారా మిలిటరి, పోలీసు దుస్తులు ధరించి యూనివర్శిటిలోని పాత రీడింగ్ హాలులోకి ప్రవేశించి, విద్యార్థులను బాటన్లతో కొడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ‘జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ)లోని డాక్టర్ జాకీర్ హుస్సేన్ లైబ్రరీలో పోలీసులు చేసిన క్రూరమైన దాడికి సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఆ వీడియోను యూనివర్శిటి విడుదల చేయలేదని స్పష్టం చేయడం జరుగుతోంది’ అని ఆ సంస్థ ప్రజా సంబంధాల అధికారి అహ్మద్ అజీమ్ ఆదివారం తెలిపారు. జామియా జాయింట్ కోఆర్డినేషన్ కమిటి (జేసీసీ) ఈ వీడియోను విడుదల చేసింది. జేఎంఐ విద్యార్థులు, మాజీ విద్యార్థులు కలిసి ఏర్పాటు చేసిందే జేసీసీ. డిసెంబర్ 15వ తేదీన పోలీసులు చేసిన క్రూరమయిన దాడి తరువాత జేసీసీ ఏర్పడింది. జాతీయ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా జేఎంఐ సమీపంలో జరిగిన నిరసన ప్రదర్శనలో హింస చోటు చేసుకున్న తరువాత పోలీసులు డిసెంబర్ 15న యూనివర్శిటి లైబ్రరీలోకి ప్రవేశించి విద్యార్థులను తీవ్రంగా కొట్టారు. సీఏఏ, ప్రతిపాదిత జాతీయ పౌర రిజిస్టరు (ఎన్‌ఆర్‌సీ), జాతీయ జనాభా రిజిస్టరు (ఎన్‌పీఆర్)లకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళన కార్యక్రమాలకు జేసీసీ నాయకత్వం వహిస్తోంది.